Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘రెండు లక్షలు తీసుకురా’ అంటూ అత్త, భర్త ఆమెను చావబాదారు.. వెంటనే ఆమె ఏం చేసిందంటే..

బీహార్ రాజధాని పట్నాలో వరకట్న వేధింపుల ఉదంతం వెలుగు చూసింది. ఇది బేగంపూర్ జల్లావాలె హనుమాన్ మందిరం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ వరకట్నం తీసుకురాలేదని ఆమెపై అత్తమామలతో పాటు భర్త కూడా దాడి చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్తామామలు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. 

ఆదివారం అర్థరాత్రి అత్త, తన భర్త ఇద్దరూ కలిసి తనపై దాడి చేశారని అయితే వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్నానని ఆమె పేర్కొంది. కాగా అత్తా, భర్తల చేతిలో దెబ్బలున్న ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె మొరవిన్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితురాలిని అత్తారింటివారు కట్నంగా రెండు లక్షల రూపాయలు తీసుకురమ్మంటున్నారని, ఆమె ఆ మెత్తాన్ని తీసుకురాకపోవడంతో దాడి చేశారని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement