వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే..

ABN , First Publish Date - 2021-07-29T05:46:48+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూ డో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ

వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే..

  • ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 700 పాయింట్లు డౌన్‌
  • చివరకు 135 పాయింట్ల నష్టంతో 52,443 వద్ద ముగింపు
  • బ్యాంకింగ్‌, ఆటో షేర్లలో అమ్మకాల వెల్లువ 


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూ డో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు  బలహీనంగా ఉండటంతో పాటు అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ విధానపరంగా కీలక నిర్ణయాలు తీసుకోనుందన్న వార్తలతో బుధవారం స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు హోరెత్తాయి. దీంతో బీఎ స్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఒక దశలో 700 పాయింట్లకు పైగా పతనమై 51,802.73 పాయింట్ల డే కనిష్ఠ స్థాయిని తాకింది.


ఆ తర్వాత మిడ్‌ సెషన్‌లో మెట ల్స్‌, ఐటీ రంగాలు రికవరీ కనబరచటంతో సెన్సెక్స్‌ డే కనిష్ఠ స్థాయిల నుంచి 640 పాయింట్ల వరకు కోలుకుని చివరకు 135.05 పాయింట్ల నష్టంతో 52,443.71 పాయింట్ల వద్ద క్లోజైంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ కూడా ఆరంభ సెషన్‌లో 1551345 పాయింట్ల స్థాయికి పడిపోయి చివరకు 37.05 పాయింట్ల నష్టంతో 15,709.40 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంకింగ్‌, ఎనర్జీ, ఆటో స్టాక్స్‌ల్లో అమ్మకాలు వెల్లువెత్తటంతో పాటు గురువారం జూలై నెల డెరివేటివ్స్‌ ముగింపు ఉండటం కూడా మార్కెట్ల పతనానికి కారణంగా ఉంది.


 సెన్సెక్స్‌ షేర్లలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అత్యఽధికంగా 2.64 శాతం నష్టపోగా డాక్టర్‌ రెడ్డీస్‌, మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. కాగా టారి్‌ఫలను పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించటంతో కంపెనీ షేరు 5.08 శాతం వరకు లాభపడింది.


కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవటంతో పాటు ఫార్మా స్టాక్స్‌ పతనబాటలో సాగటం వంటి అంశాలు మార్కెట్‌ను మరింత బేర్‌ పట్టులోకి తీసుకువెళ్లాయని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. బీఎ్‌సఈ ఆటో, బ్యాంకెక్స్‌, రియల్టీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగాలు 1.01 శాతం వరకు నష్టపోగా టెలికాం, మెటల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలు లాభాలతో ముగిసాయి. 


Updated Date - 2021-07-29T05:46:48+05:30 IST