మంజీరాలో.. ఇసుకాసురులు!

ABN , First Publish Date - 2022-09-21T04:55:37+05:30 IST

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా ఆగడం లేదు. జిల్లాలోని వాగులు, న దుల్లోంచి ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ తరలిస్తున్నారు.

మంజీరాలో.. ఇసుకాసురులు!
బిచ్కుంద వద్ద మంజీరాలో ఇసుక తవ్వకాలు

రాత్రీ, పగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్న అక్రమార్కులు

బీర్కూర్‌, బిచ్కుంద క్వారీల పేరిట అక్రమంగా తరలింపు

స్థానిక నేతలు, అధికారుల అండదండలతో ఇసుక తవ్వకాలు

మైనింగ్‌శాఖ జరిమానాలు విధిస్తున్నా ఆగని దందా

కామారెడ్డి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా ఆగడం లేదు. జిల్లాలోని వాగులు, న దుల్లోంచి ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ తరలిస్తున్నారు. ప్రధానంగా మంజీరా నదిలోంచి కోట్లాది రూపాయల ప్రకృ తి సంపదను కొల్లగొడుతున్నారు. బీర్కూర్‌, బిచ్కుంద క్వారీ ల పేరిట మరికొందరు ఇసుకాసరులు, కాంట్రాక్టర్లు రాత్రు లు, పగలు తేడా లేకుండా స్థానిక నేతలు, అధికారుల అండ దండలతోనే ట్రాక్టర్‌లు భారీ లారీలు, టిప్పర్‌లతో హైదరాబా ద్‌, మహారాష్ట్రలాంటి మహానగరాలకు తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు.ఓ వైపు మైనింగ్‌, పోలీస్‌శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ ఇసుక లారీలను, ట్రాక్టర్లను పట్టుకుని జరి మానా విధిస్తున్నారు. ఇటీవల మైనింగ్‌ అధికారులు 36 ఇ సుక అక్రమ రవాణా కేసులు నమోదు చేశారంటే ఏ స్థాయి లో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందో తెలుస్తోంది.

అభివృద్ధి పనుల పేరిట పక్కదారి..

మంజీరా ఇసుకకు హైదరాబాద్‌, మహారాష్ట్ర, కర్ణాటక మంచి డిమాండ్‌ ఉంది. ఈ ప్రాంతాలు మంజీరా నదికి సరి హద్దు కావడంతో ఇసుకాసరులు సులువుగా అక్రమంగా ఇ సుకను తరలించేస్తున్నారు. జిల్లాలో మంజీరా నదిలో బి చ్కుంద, బీర్కూర్‌ క్వారీల నుంచి అభివృద్ధి పనులకు ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. నీటిపారుదలశాఖ చెక్‌డ్యాంలు, డబుల్‌ బెడ్‌ రూం, అర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ శా ఖలకు సంబంధించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, భవనాలతో పా టు మరుగుదొడ్ల నిర్మాణానికి స్థానికంగా రెవెన్యూ అధికా రులు ఇసుకను తవ్వుకునేందుకు మంజీరాలో అనుమతులు ఇస్తున్నారు. దీంతో బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బి చ్కుంద, పిట్లం తదితర మండలాల్లో స్థానికంగా ఉండే కిం ద స్థాయి నాయకులు స్థానిక అధికారుల అండదండతో ఇసుకను అక్ర మ రవాణా చే స్తు న్నట్లు ఆరో పణలు వస్తు న్నాయి. బా న్సువాడలోని అధికార పార్టీకి చెందిన పలువు రు ముఖ్యనేతలు పేర్లు చెప్పి ఓ కాంట్రాక్టర్‌ మరింత రెచ్చి పోతూ అభివృద్ధి పనుల పేరిట బీర్కూర్‌ క్వారీల నుంచి రా త్రుల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బీర్కూర్‌లోని మంజీరా నది నుంచి రాత్రుల్లో ఇసుక తవ్వ కాలు చేపట్టడం, లారీలు, టిప్పర్‌ల ద్వారా బారీ లోడ్‌లతో నస్రూల్లాబాద్‌, బాన్సువాడలలోని రహస్య ప్రాంతాల్లో డంప్‌ చేస్తూ సదరు కాంట్రాక్టర్‌ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సదరు కాంట్రాక్టర్‌కు స్థానిక నేతల, అధికారుల అండదండలు ఉండడంతోనే ఇసుక అక్రమ రవాణా సాఽగిస్తున్నట్లు తెలుస్తోంది.

మంజీరాను కొల్లగొడుతున్నారు..

జిల్లాలో నిజాంసాగర్‌, పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్‌ మండలాల మీదుగా మంజీరా ఉంది. ఈ మం జీరా నదిలో చాలానే ఇసుక క్వారీలు ఉండేవి. గతంలో ఈ క్వారీల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోప ణలతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేవలం ప్రభుత్వ ప థకాల నిర్మాణాలకు మాత్రమే ఇసుక తవ్వకాలు అనుమతి స్తున్నారు. మంజీరా నదిలో ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరి ట అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. ఇలా కొన్ని రోజుల పాటు మం జీరాలో ఎలాంటి ఇసుక తవ్వకాలు జరగలేదు. ఇటీవల కా లంలో పలు అభివృద్ధి పనులకు మంజీరాలో ఇసుక తవ్వ కాలకు అనుమతులు ఇచ్చారు. బిచ్కుంద, బీర్కూర్‌ల ఇసుక క్వారీలలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న ఇసుక మాఫియా, స్థానిక చోటామోటా నాయకు లు ఇసుకను అక్రమంగా తరలించేందుకు తెరలేపుతున్నారు. అధికారుల అండదండలతో కాంట్రాక్టర్ల ముసుగులో మంజీ రాను కొల్లగొడుతూ రాత్రులు, పగలు తేడా లేకుండా ఇసుక ను జిల్లా సరిహద్దులు దాటిస్తూ దందా కొనసాగిస్తున్నారు.

కేసులు పెడుతున్న ఆగని దందా..

అక్రమ ఇసుక రవాణాకు జిల్లా మైనింగ్‌శాఖతో పాటు పోలీస్‌శాఖ ఎడాపెడా కేసులు పెడుతున్న ఇసుక అక్రమ ర వాణా మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒక చోట పోలీసులు కానీ, మైనింగ్‌ అధికారులు కానీ ఇసుక ట్రా క్టర్‌లను, లారీలను పట్టుకొవడమే అక్రమ ఇసుక రవాణాకు నిదర్శనం. ఇటీవల కాలంలో మైనింగ్‌శాఖ అధికారులు 36 అక్రమ ఇసుక, ఇటుక, మొరం వంటి కేసులను నమోదు చే శారు. ఇందులో అధిక మొత్తంలో అక్రమ ఇసుక రవాణా కే సులే ఉన్నట్లు మైనింగ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న, ట్రాక్టర్లు, లారీలు, టిప్ప ర్‌లపై విధించిన జరిమానా కింద ప్రభుత్వానికి రూ.9.50 లక్షల ఆదాయం సమకూరాయి. గత ఏడాది 45 కేసులు నమోదు చేయగా జరిమానా రూపంలో రూ.24లక్షల నగదు సమకూరింది. ఇలా జిల్లాలో అధిక లోడ్‌, అక్రమ ఇసుక రవాణా కేసులు పెద్ద మొత్తంలో నమోదు అవుతుండడంతో ఏ స్థాయిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందో తెలు స్తుంది. కొన్ని శాఖలు అక్రమ ఇసుక రవాణపై నిఘా పెడు తుంటే మరికొన్ని శాఖల వారు ఇసుక సరులకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నాం..

- నర్సిరెడ్డి, జిల్లా మైనింగ్‌ శాఖ అధికారి

జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకుం టున్నాం. ప్రస్తుతం బీర్కూర్‌, బిచ్కుంద క్వారీలు మాత్ర మే టీఎస్‌ఎంబీసీ పరిధిలో అనుమతులు తీసుకొని అభి వృద్ధి పనులకు తవ్వకాలు చేస్తున్నారు. మిగతా ఎక్కడ కూడా ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు. ఈ సం వత్సర కాలంలో జిల్లా వ్యాప్తంగా అధిక ఇసుకలోడ్‌, అక్ర మ ఇసుక రవాణా లాంటి కేసులను భారీగానే నమోదు చేశాం. కేసులతో పాటు సంబంధిత వాహనాలను సీజ్‌ చేయడం బారీగా జరిమానాలు విధించడం జరిగింది. అక్రమ ఇసుకను ప్రోత్సహించేది లేదు. ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా జరిగితే తమకు సమాచారం ఇవ్వాలి.


Updated Date - 2022-09-21T04:55:37+05:30 IST