Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముత్యాలంపల్లిలో ప్రబలిన విషజ్వరాలు


- వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేయించిన మాజీ మంత్రి పరిటాల సునీత

రామగిరి, డిసెంబరు 2: మండలంలోని ముత్యాలంపల్లిలో విషజ్వ రాలు ప్రబలడంతో మాజీమంత్రి పరిటాలసునీత గ్రామాన్ని సందర్శించి బాధి తులను పరామర్శించారు. ఆమె గురువారం ఆమె గ్రామానికి వెళ్లి, మండల వైద్యాధికారితో మాట్లాడి వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయించారు. గతనెలలో నూ గ్రామంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేయించారు. ఇటీవల కురిసిన వ ర్షాలకు గ్రామంలో అపరిశుభ్రత నెలకొని, జ్వరాలు ఎక్కువ కావడంతో ఆమె సంబంధిత పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి, వెంటనే గ్రామంలో వీధుల న్నీ శుభ్రం చేయించాలన్నారు. ప్రతి ఇంటా జ్వరబాధితులు ఉన్నారని, వైద్య సేవలు కొద్దిరోజుల పాటు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. జ్వర బాధితుల నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. గ్రామాల్లో పరిశుభ్రత లోపించి జ్వరాలు ప్రబలుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందన్నారు. జ్వరబాధితులకు అన్ని విధాలా అండగా ఉంటా మన్నారు. వైద్యశిబిరం వద్ద ఇస్తున్న మందులను పరిశీలించారు. సరైన మందులు అందించి ప్రతిరోజూ రోగులకు వైద్యసేవలు అందించాలన్నారు. 


Advertisement
Advertisement