ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూడో సినిమా ‘పుష్పక విమానం’. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న దామోదర మాట్లాడుతూ ‘‘వార్తల్లో చూసిన ఓ సంఘటన స్ఫూర్తితో, నిజ జీవిత పాత్రలను జోడించి కథ సిద్ధం చేసుకున్నా. హీరోది ప్రభుత్వ ఉపాధ్యాయుడి పాత్ర. మధ్యతరగతి కుటుంబాల్లో పరిస్థితులు, పెళ్లి నేపథ్యంలో సినిమా ఉంటుంది’’ అన్నారు. ముఖ్య పాత్రల్లో సునీల్, నరేశ్ వీకే, కథానాయికలుగా శాన్వీ మేఘన, గీత్ సాయిని నటించిన ఈ చిత్రానికి రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీత దర్శకులు.