Abn logo
May 7 2021 @ 05:51AM

మే 31 వరకు వివాహాలపై నిషేధం

రాజస్థాన్ సర్కారు సంచలన నిర్ణయం

జైపూర్ (రాజస్థాన్): కరోనా కేసుల కట్టడి కోసం మే 31వతేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో వివాహాలను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా మే 10 నుంచి మే 24వతేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో పూర్తిగా లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై గతంలో సీఎం నియమించిన ఐదుగురు మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక మేర రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంపూర్ణ లాక్ డౌన్, వివాహాలపై నిషేధం నిర్ణయం తీసుకున్నారు. కేవలం 11 మంది అతిథులతో ఇళ్లలోనూ వివాహాలకు అనుమతించరాదని నిర్ణయించారు.అత్యవసరం తప్ప అన్ని వాహనాల రాకపోకలను నివారించారు. 

Advertisement