Abn logo
Aug 21 2021 @ 08:38AM

Goa: ఇద్దరు రష్యా మహిళల మృతదేహాలు లభ్యం

పనాజీ (గోవా): గోవా రాష్ట్రంలోని ఉత్తర గోవా ప్రాంతంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రష్యా మహిళల మృతదేహాలు వెలుగుచూశాయి. 24 గంటల సమయంలో ఇద్దరు రష్యా మహిళల మృతదేహాలు లభించడం గోవాలో సంచలనం రేపింది. ఉత్తర గోవాలో రష్యాకు చెందిన అలెగ్జ్రాండ డిజవి (24), ఇకటేరినా టిటోవా (34)లనే మహిళల మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. అలెగ్జ్రాండ డిజవి అనే రష్యా మహిళ అద్దె ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుందని పోలీసులు చెప్పారు. మరో ఘటనలో అపార్టుమెంటులో ఇకటేరినా టిటోవా మృతదేహం లభించింది. ఈ రెండు వేర్వేరు కేసులకు సంబంధం లేదని పోలీసులు చెప్పారు. ఈ రష్యా మహిళల మృతి మిస్టరీపై గోవా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


క్రైమ్ మరిన్ని...