అధినేత దీక్షకు మద్దతుగా.... తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-10-22T05:06:01+05:30 IST

తెలుగుదేశం పార్టీ అఽధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల దీక్షకు జిల్లాలోని ఆ పార్టీశ్రేణులు సంపూర్ణ మద్దతు తెలిపారు. కొందరు ముఖ్యనేతలు, కొన్ని నియోజకవర్గాల కార్యకర్తలు గురువారం నేరుగా చంద్రబాబును కలిసి సంఘీభావం తెలుపగా, కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా దీక్షలు నిర్వహించి మద్దతు తెలిపారు. వైసీపీ దాడులకు నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్‌ నిర్వహించడంతో పాటు 36 గంటల దీక్షను చంద్రబాబునాయుడు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టారు.

అధినేత దీక్షకు మద్దతుగా....  తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు
తాడేపల్లిలో చంద్రబాబు చేపట్టిన దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలుపుతున్న జిల్లా ఎమ్మెల్యేలు ,నాయకులు

జిల్లాలోనూ సంఘీభావ కార్యక్రమాలు

నేడు మరికొంతమంది కేంద్ర కార్యాలయానికి..

ఒంగోలు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అఽధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల దీక్షకు జిల్లాలోని ఆ పార్టీశ్రేణులు సంపూర్ణ మద్దతు తెలిపారు. కొందరు ముఖ్యనేతలు, కొన్ని నియోజకవర్గాల కార్యకర్తలు గురువారం నేరుగా చంద్రబాబును కలిసి సంఘీభావం తెలుపగా, కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా దీక్షలు నిర్వహించి మద్దతు తెలిపారు. వైసీపీ దాడులకు నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్‌ నిర్వహించడంతో పాటు 36 గంటల దీక్షను చంద్రబాబునాయుడు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టారు. జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు అధినేతను కలిసి సంఘీభావం తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌, పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్య దీక్ష ప్రారంభం నుంచి అక్కడే ఉన్నారు. అలాగే ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, గిద్దలూరు, మార్కాపురం, వైపాలెం, నియోజకవర్గ ఇన్‌చార్జీలు అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, ఎరిక్షన్‌బాబు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతో పాటు పలు నియోజకకవర్గాల నుంచి వందలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు అధినేతను కలిసి సంఘీభావం తెలిపారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ గురువారం రాత్రి దీక్షా శిబిరానికి పార్టీశ్రేణులతో వెళ్లి అధినేతను కలిశారు. మరికొంతమంది నేతలు శుక్రవారం వెళ్లనున్నట్లు సమాచారం. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అధినేత దీక్షకు మద్దతుగా స్థానిక టీడీపీ శ్రేణులు దీక్షలు చేపట్టారు. 


Updated Date - 2021-10-22T05:06:01+05:30 IST