Abn logo
Sep 24 2021 @ 01:00AM

జిల్లా కేంద్రంలో రూ. 1.5 కోట్లతో ఈ-లైబ్రరీ నిర్మాణం

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌

నిర్మల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 23 : నిర్మల్‌లో రూ. 1.5 కోట్లతో ఈ-లైబ్రరీ నిర్వహించనున్నామని గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌ తెలిపారు. గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఆమోదించామని అన్నా రు. దీనికోసం గాను కోల్‌కత్తాకు చెందిన రాజారామ్‌మోహన్‌రాయ్‌ లైబ్రరీ ఫౌండే షన్‌ ఈ-లైబ్రరీ నిర్మాణానికి ఆర్థికసహాయం ప్రకటించిందన్నారు. భవన నిర్మాణం కోసం సంచాలకుడికి ప్రతిపాదనలు పంపించేందుకు ఆమోదించామన్నారు. ప్రస్తు త గ్రంధాలయ భవనంపై అంతస్తులో పోటీపరీక్షలకు చదువుకునే అభ్యర్థుల కోసం రూ.20 లక్షలతో నిర్మాణం చేపట్టేందుకు ఆలోచించామని అన్నారు. బడ్జెట్‌లో రూ.40 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. కుభీర్‌లో వనసంరక్షణ సమితి ఆ వరణలో గ్రంధాలయ భవన నిర్మాణానికి గ్రామపంచాయతీ స్థలం కేటాయించింద న్నారు. రూ.15 లక్షలతో అక్కడ భవనం నిర్మిస్తామని పేర్కొన్నారు. లోకేశ్వరంలోని గ్రంధాలయ భవన మరమ్మతులకు రూ.5 లక్షలు మంజూరుకు ఆమోదించినట్లు వివరించారు. జిల్లాలో 14 గ్రంధాలయాలు  ఉండగా అక్కడ స్వీపర్ల నియామ కానికి నిర్ణయించామని, పార్ట్‌టైం వర్కర్లకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లింపునకు ఆమోదించినట్లు చెప్పారు. రూ.20 లక్షలతో పుస్తకాల కొనుగోలుకు ప్రతిపాదనలు సంచాలకుడికి పంపించామని, రూ.పదిలక్షలతో ఇతర పుబ్లికేషన్‌ పుస్తకాలకు ప్రతిపాదించామని అన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి పి. లక్ష్మి రాజ్యం, డీపీవో వెంకటేశ్వర్‌రావు, డీపీఆర్‌వో ఉమారాణి, సెక్టోరియల్‌ అధికారి సలోని కరుణ పాల్గొన్నారు.