20 సెకన్లలో HD Movie ని డౌన్‌లోడ్ చేస్కోవచ్చు.. 2022లో ఈ 13 నగరాల్లో మొదటి రోజు నుంచే..

ABN , First Publish Date - 2021-12-29T18:04:21+05:30 IST

వాట్సాప్ ద్వారా స్నేహితులతో మాట్లాడుతూంటే కాల్ బ్రేక్ అవుతోందా? హెచ్‌డీ సినిమాను డౌన్‌లోడ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతోందా?

20 సెకన్లలో HD Movie ని డౌన్‌లోడ్ చేస్కోవచ్చు.. 2022లో ఈ 13 నగరాల్లో మొదటి రోజు నుంచే..

వాట్సాప్ ద్వారా స్నేహితులతో మాట్లాడుతూంటే కాల్ బ్రేక్ అవుతోందా? హెచ్‌డీ సినిమాను డౌన్‌లోడ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతోందా? యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటే బఫర్ అవుతోందా? అయితే త్వరలోనే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం రాబోతోంది. వచ్చే ఏడాది 5జీ నెట్‌వర్క్‌ దేశమంతా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందస్తుగా దేశంలోని 13 నగరాల్లో 5జీని అందుబాటులోకి తేనున్నారు. 


4జీ తో పోల్చుకుంటే 5జీలో ఇంటర్నెట్ స్పీడ్ పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. జనవరి 1వ తేదీ నుంచి 13 నగరాల్లో 5జీ అందుబాటులోకి రానుంది. ఢిల్లీ, లక్నో (యూపీ), ఛండీగఢ్ (పంజాబ్, హర్యానా), గురుగ్రామ్ (హర్యానా), అహ్మదాబాద్ (గుజరాత్), జామ్ నగర్ (గుజరాత్), గాంధీనగర్ (గుజరాత్), ముంబై (మహారాష్ట్ర), పుణె (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), చెన్నై (తమిళనాడు), హైదరాబాద్ (తెలంగాణ), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్) నగరాల్లో జనవరి 1 నుంచి 5జీ అందుబాటులోకి రానుంది. భారతీ ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్-ఐడియా ప్రొవైడర్లు ఆయా నగరాల్లో 5జీ సర్వీస్‌ను అందించబోతున్నాయి. 


5జీ వల్ల ఉపయోగాలేంటి? 

ఐదో జనరేషన్ ఇంటర్నెట్ నెట్‌వర్క్ కారణంగా భారతదేశ ముఖ చిత్రమే మారిపోతుందని దేశంలో 5జీ పనులను పర్యవేక్షిస్తున్న ఎరిక్‌సన్ కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా వినోదం, కమ్యూనికేషన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని, రాబోయే ఐదేళ్లలో దాదాపు 50 కోట్ల మంది వినియోగదారులు 5జీ సేవలను వినియోగించుకుంటారని చెబుతోంది. ఇంతకీ 5జీ వల్ల ఉపయోగాలేంటంటే.. 


1)మొట్ట మొదటి ఉపయోగం ఇంటర్నెట్ స్పీడ్ విపరీతంగా పెరగడం. 4జీతో పోల్చుకుంటే 5జీలో ఇంటర్నెట్ స్పీడ్ 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 

2)వీడియో గేమింగ్ విభాగానికి 5జీ రాకతో రెక్కలు వస్తాయి. 

3)యూట్యూబ్‌లో పాజ్, బఫరింగ్ లేకుండా వీడియోలు ప్లే అవుతాయి. 

4)చిన్న బ్రేక్ కూడా లేకుండా వాట్సాప్ కాల్ మాట్లాడుకోవచ్చు. 

5)20 సెకెండ్లలో సినిమా మొత్తం డౌన్‌లోడ్ అయిపోతుంది. 

6)వ్యవసాయ రంగంలో డ్రోన్‌లను విస్తృతంగా వినియోగించవచ్చు.

7)మెట్రో, డ్రైవర్ రహిత వాహనాలను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. 

8)కర్మాగారాల్లో రోబోల వినియోగాన్ని పెంచవచ్చు. 


Updated Date - 2021-12-29T18:04:21+05:30 IST