Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్కకు సహాయం చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లింది.. ఎవరూ లేనపుడు ఆమె మరిది అత్యాచారం చేశాడు.. ఎదురు తిరిగితే పెళ్లి చేసుకుంటానన్నాడు.. తీరా చూస్తే..

ఇంట్లో ఎవరూ లేనపుడు అతడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎవరికైనా చెబితే చంపేస్తానన్నాడు.. ఆ బాలిక ఎదురు తిరగడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. ఆ తర్వాత ఆమెను పలుసార్లు అత్యాచారం చేశాడు.. తీరా పెళ్లి విషయం అడిగేసరికి మాట మార్చాడు.. పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు.. దీంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 


భోపాల్‌కు సమీపంలోని జంపాల్‌పుర గ్రామానికి చెందిన బాలిక అక్టోబర్‌లో తన అక్క ఇంటికి వెళ్లింది. అక్క గర్భవతి కావడంతో ఆమెకు సహాయంగా ఉండేందుకు అక్కడకు వెళ్లింది. అక్క మరిది సల్మాన్ ఆ బాలికపై కన్నేశాడు. అక్టోబర్ 15న బాధిత బాలిక అక్క డెలివరీ కోసం హాస్పిటల్‌లో జాయిన్ అయింది. దీంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉండిపోయింది. ఆ సమయంలో నిందితుడు సల్మాన్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయినా బాలిక భయపడకపోవడంతో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. 


సల్మాన్ మాటలు నమ్మిన బాలిక అతడికి మరింత దగ్గరైంది. తాజాగా పెళ్లి గురించి అడిగితే అతను మాట మార్చాడు. పెళ్లి చేసుకునేది లేదని స్పష్టం చేశాడు. దీంతో బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు ఆదివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement