Abn logo
May 22 2020 @ 05:40AM

తెలంగాణ రాష్ట్రంలోనూ జిల్లాకు తీరని అన్యాయం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌


ఆదిలాబాద్‌టౌన్‌, మే 21: తెలంగాణ రాష్ట్రంలోనూ జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి విడతలో 8016 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. 2018-19, 2019-20 సంవత్సరాలకు గాను రైతులకు రావాల్సిన రూ.300 కోట్ల ఇన్సూరెన్స్‌ డబ్బులు కంపెనీలు చెల్లించడం లేదని దీనిపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. రూ.11వేల కోట్లు రుణమాఫీ విడుదల చేస్తే సంబరాలు చేసుకున్న నేతలు, ఎమ్మెల్యేలు ఇన్సూరెన్స్‌ డబ్బులకు ఏం సమాధానాలు చెబుతారని ప్రశ్నించారు. సమావేశంలో కిసాన్‌ మోర్చా నాయకులు దయాకర్‌, ఆదినాథ్‌, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement