టాప్‌ త్రీలో..వనపర్తి

ABN , First Publish Date - 2020-04-05T10:59:40+05:30 IST

హరితహారం మొక్కల సంరక్షణలో వనపర్తి జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నట్లు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌

టాప్‌ త్రీలో..వనపర్తి

హరితహారం నిర్వహణలో మూడో స్థానం

మొక్కల సంరక్షణ జిల్లాలో 88.34 శాతం

కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా


వనపర్తి కలెక్టరేటు, ఏప్రిల్‌ 4 : హరితహారం మొక్కల సంరక్షణలో వనపర్తి జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నట్లు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓ వైపు కరోనా నిర్మూలనకు కృషి చేస్తూనే, మరో వైపు హరితహారం మొక్కలను సంరక్షించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్ర స్థాయిలో మొక్కల సంరక్షణ సగటున 10 శాతం ఉండగా, వనపర్తి జిల్లా 88.34 శాతంతో రాష్ట్రంలోనే మూడవ స్థానంలో నిలిచిందని వివరించారు.


ఉపాధి హామీ పథకం కింద క్షేత్రస్థాయి సహాయకులు లేకున్నా, గ్రామ పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ట్యాంకర్ల ద్వారా నీరు పోయించి మొక్కలను కాపాడటం జరిగిందని వెల్లడించారు. కాగా, కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వానికి మద్దతుగా పలువురు దాతలు ఆహారం, నిత్యావసర సరుకులు, డబ్బులు ఇస్తున్నారని, సహాయం చేయాలనుకునే దాతలు ముందుగా కమాండు కంట్రోలు రూమ్‌కు తెలియజేయాలని సూచించారు. ఇందుకు అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2020-04-05T10:59:40+05:30 IST