కరోనా రోగులను గుర్తించేందుకు జాగిలాలకు శిక్షణ

ABN , First Publish Date - 2020-03-28T12:23:49+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రోగులను వాసన ద్వార గుర్తించేందుకు జాగిలాలు ఎంత వరకు సహాయపడతాయో లేదో తెలుసుకునేందుకు లండన్ నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ డాగ్ స్క్వాడ్ నిపుణులు శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు....

కరోనా రోగులను గుర్తించేందుకు జాగిలాలకు శిక్షణ

లండన్ (యూకే): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రోగులను వాసన ద్వార గుర్తించేందుకు జాగిలాలు ఎంత వరకు సహాయపడతాయో లేదో తెలుసుకునేందుకు లండన్ నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ డాగ్ స్క్వాడ్ నిపుణులు శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు సాగిస్తున్నారు. వాసన ద్వార కుక్కలు(జాగిలాలు) పలు రోగులను ఇప్పటికే గుర్తిస్తున్న నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారిని కూడా జాగిలాలు గుర్తించేలా వాటికి ఆరువారాల పాటు శిక్షణ ఇవ్వాలని లండన్ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ప్రతీ వ్యాధికి ఒక ప్రత్యేక మైన వాసన ఉంటుందని, దీని సాయంతోనే జాగిలాలు కరోనా వైరస్ రోగులను గుర్తించే సామర్థ్యం జాగిలాలకు ఏమేర ఉందో తెలుసుకునేందుకు లండన్ నగరానికి ఉత్తరాన ఉన్న గ్రేట్ హార్‌వుడ్‌లోని మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఛారిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థలు ఈశాన్య ఇంగ్లాండులోని డర్హామ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కలిసి జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే విషయంపై పరిశోధనలు సాగిస్తున్నారు.


పార్కిన్సన్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాధిగ్రస్థుల రోగుల నుంచి తీసిన నమూనాలను వాసన ద్వార జాగిలాలు గుర్తించేలా ఈ స్వచ్ఛంద సంస్థ గతంలో శిక్షణ ఇచ్చింది. ఓ వ్యక్తికి జ్వరం ఉందో లేదో కూడా జాగిలాలు గుర్తించగలవని, జాగిలాలు కరోనా వైరస్ రోగులను వాసన ద్వారా సులభంగా గుర్తించగలవని మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఛారిటీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్లైర్ గెస్ట్ చెప్పారు. గతంలో జాగిలాలు మలేరియాను గుర్తించాయని, శ్వాసకోసవ్యాధి అయిన కరోనా వైరస్ ను కూడా గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్లైర్ గెస్ట్ వివరించారు. జాగిలాలు కరోనా వైరస్ సోకిన రోగులను గుర్తిస్తే దీన్ని వేగంగా నివారించవచ్చని భావిస్తున్నారు. 

Updated Date - 2020-03-28T12:23:49+05:30 IST