జాతిపితా నీ జ్ఞాపకంలో!

ABN , First Publish Date - 2020-10-02T06:02:22+05:30 IST

బోసినవ్వుల బాపు భారతీయుల ఆత్మ! ఆయుధం పట్టని అహింసామూర్తి!...

జాతిపితా నీ జ్ఞాపకంలో!

బోసినవ్వుల బాపు

భారతీయుల ఆత్మ!

ఆయుధం పట్టని

అహింసామూర్తి!

తెల్లవారికి తాను

సింహస్వప్నం!

లాఠీలు, తూటాలు

లెక్కచేయని తెగువ!

దేశమాత కొరకు

నేలకొరిగిన మేరువు!

పదవులు కోరని

నిస్వార్థజీవి!

ఖద్దరు కట్టిన 

కర్మయోగి!

శాంతిసుధలు పంచిన 

గీతాచార్యుడు!

జనులను ఏకంచేసిన

జాతిపిత అతడు!

సత్యాగ్రహాన్ని ఆచరించిన 

సర్వసంగపరిత్యాగి!

జాతి కొలిచే

ఇలవేలపు!

మనస్మరణలో సదా

మహాత్ముడు!

బొబ్బిలి శ్రీధర్‌

Updated Date - 2020-10-02T06:02:22+05:30 IST