Advertisement
Advertisement
Abn logo
Advertisement

జూమ్ మీటింగ్‌లోనే... 900 మంది ఉద్యోగాలు హాంఫట్...

న్యూయార్క్ : అమెరికాలో ఓ కంపెనీ అధినేత ఏకంగా జూమ్ మీటింగ్‌లోనే వందల మంది ఉద్యోగులను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్(అమెరికా)కు చెందిన హోమ్-ఓనర్‌షిప్ సంస్థ కేవలం  కేవలం మూడంటే మూడు నిమిషాల్లో... 900 మంది ఉద్యోగులను జూమ్ కాల్ ద్వారా  తొలగించివేసింది. ఉద్యోగుల తొలగింపునకు ముందు పాటించవలసిన నియమ నిబంధనలు తోసిరాజని మరీ ఈ చర్యకు పూనుకుంది. జూమ్ కాల్‌కు హాజరైన ఉద్యోగులకు... తమ ఉద్యోగాలకు అదే చివరి రోజు అనే విషయం కూడా అప్పటి వరకు తెలియకపోవడం గమనార్హం.


ఇక... పింక్ స్లిప్ అంతుకున్న ఓ ఉద్యోగి(ఉద్యోగం నుంచి తీసివేస్తే అమెరికాలో సంబంధిత సంస్థలు ఇచ్చే  స్లిప్)... సంబంధిత షార్ట్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. న్యూయార్క్‌లో హోమ్-ఓనర్‌షిప్ కంపెనీ బెట్టర్ డాట్ కామ్. ఈ సంస్థ  సీఈవో భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్. జూమ్ సమావేశంలో కంపెనీలోని 900 మంది ఉద్యోగులను ఆయన  తొలగించారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది తొమ్మిది శాతం.  మార్కెట్ సామర్థ్యం, పనితీరు, ప్రోడక్టివిటీ తదితర అంశాలను ఉద్యోగులను తొలగింపునకు కారణాలుగా  చూపించారు.


జూమ్ సమావేశాన్ని ప్రారంభిస్తూ... ‘మీకు నేను సంతోషకరమైన వార్తను ఇవ్వడం లేదు.  మార్కెట్ మార్పులకణుగుణంగా కంపెనీ కూడా మారుతోంది’ అని చెబుతూ ఉద్యోగులకు పింక్ స్లిప్ సంకేతాలనిచ్చారు. ఆ తర్వాత తొలగింపు గురించి వెల్లడించారు. పని తీరు బాగాలేదంటూ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పనితీరు బాగా లేదని, మార్కెట్‌లో ఆశించినస్థాయిలో కష్టపడడం లేదని, నిర్దేశించిన వ్యాపారం చేయలేకపోతున్నారని, లక్ష్యాలను అందుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఈ క్రమంలో... తక్షణమే మిమ్మల్ని ఉద్యోగంనుండి తీసివేస్తున్నామని ప్రకటించారు. ఇదంతా మూడు నిమిషాల్లో జరిగిపోవడం గమనార్హం. ‘సమావేశానికి హాజరైనందుకు ధన్యవాదాలు. నేను మీకు గొప్ప వార్తనేమీ తీసుకురాలేదు. మార్కెట్ అంతా మారిపోయిందని మీకు తెలుసు. మారిన మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికణుగుణంగా కంపెనీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. కంపెనీ... పదిహేను శాతం మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇందుకు మార్కెట్, సామర్థ్యం, పనితీరు, ప్రోడక్టివిటీ తదితర  కారణాలు ఉన్నాయి' అని పేర్కొన్నారు. అయితే బెట్టర్ డాట్ కామ్ బాస్ ఆ తర్వాత... తొలగించిన ఉద్యోగుల సంఖ్య 15 నుండి 9 శాతానికి సవరించుకున్నారు. ఈ కాల్(తొలగింపు)లో మీరు ఉన్నట్లయితే దురదృష్టవంతులు అని చెబుతూ... ‘మీ ఉద్యోగం పోయింది, ఈ మేరకు హెచ్ఆర్ నుండి మెయిల్ వస్తుంది’ అని పేర్కొన్నారు. ఉద్యోగాల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు చెప్పారు. తొలగించిన ఈ ఉద్యోగులకు నెల రోజులకు సంబంధించిన ప్రయోజనాలు, రెండు  నెలల కవరప్ అందిస్తున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది. గార్గ్ బెట్టర్ డాట్ కామ్ సంస్థను 2016 లో ప్రారంభించారు. 


మళ్లీ ఇలాంటి పరిస్థితి రావొద్దు... పింక్ స్లిప్ అందుకున్న ఓ ఉద్యోగి గార్గ్ జూమ్ వీడియోకు సంబంధించిన ఓ షార్ట్ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది. ఇలా జరగడం తన కెరీర్‌లో ఇది రెండోసారి అని, మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానని, వాస్తవానికి మొదటిసారి తాను రోడించానని, ఈసారి మాత్రం ధైర్యంగా ఉన్నానని సదరు ఉద్యోగి పేర్కొన్నారు. 

TAGS: Zoom Call
Advertisement
Advertisement