పెద్దముడియం పోలీసుస్టేషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-20T04:51:00+05:30 IST

పెద్దముడియంలో రూ.1.4 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పెద్దముడియం పోలీసుస్టేషన్‌ భవనాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ బుధవారం ప్రారంభించారు.

పెద్దముడియం పోలీసుస్టేషన్‌ ప్రారంభం
పోలీసుస్టేషన్‌ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ, ఎమ్మెల్యే

పెద్దముడియం, జనవరి 19: పెద్దముడియంలో రూ.1.4 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పెద్దముడియం పోలీసుస్టేషన్‌ భవనాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ బుధవారం ప్రారంభించారు. గత నెల 24వ తేదీ పులివెందులలో వర్చువల్‌ విధానంలో సీఎం జగన్‌ దీనిని ప్రారంభించారు. తాజాగా బుధవారం ఎస్పీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఉన్న పాత పోలీసుస్టేషన్‌ తరచూ వరదల తాకిడికి గురవుతూ అరకొర వసతుల మధ్య నడుస్తోంది. ప్రస్తుతం ప్రారంభించిన నూతన భవనంతో స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది కష్టాలు తీరినట్లయింది. కార్యక్రమంలో డీఎస్పీ నాగరాజు, రూరల్‌ సీఐ వెంకటకొండారెడ్డి, ఎస్‌ఐ శివశంకర్‌, ఇతర పోలీసు సిబ్బంది, స్థానిక వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T04:51:00+05:30 IST