కొబ్బరి నీళ్లతో ఆరోగ్యమస్తు

ABN , First Publish Date - 2021-03-23T05:35:06+05:30 IST

రోజువారీ ఆహారంలో కొబ్బరి నీళ్లను కూడా చేర్చడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చంటున్నారు వైద్య నిపుణులు. వాటిల్లో ముఖ్యమైన ప్రయోజనాలివి...

కొబ్బరి నీళ్లతో ఆరోగ్యమస్తు

రోజువారీ ఆహారంలో కొబ్బరి నీళ్లను కూడా చేర్చడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చంటున్నారు వైద్య నిపుణులు. వాటిల్లో ముఖ్యమైన ప్రయోజనాలివి... 


అధిక బరువు

ఇందులో ఉండే బయోయాక్టివ్‌ ఎంజైమ్స్‌ జీవ, జీర్ణక్రియలను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. తద్వారా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుంది. 


ఎసిడిటీ

కొబ్బరి నీళ్లలోని బయోయాక్టివ్‌ ఎంజైమ్స్‌తో పాటు అధికమొత్తంలో లభ్యమయ్యే ఫైబర్‌... పేగుల కదలికను నియంత్రిస్తుంది. ఎసిడిటీ, అజీర్ణం, ఇతర పేగు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుతుంది.  


డీహైడ్రేషన్‌

శరీరంలో ఎలక్ర్టోలైట్స్‌ను తిరిగి నింపడంలో కొబ్బరినీళ్లు ఎంతో ఉపకరిస్తాయి. తద్వారా శరీరానికి అవసరమైన నీటిని అదించి, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా రక్షిస్తాయి. 


బీపీ

రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల హైపర్‌టెన్షన్‌ నియంత్రణలో ఉంటుందన్నది ఓ పరిశోధన సారాంశం. కొబ్బరి నీరు రక్త పోటును సరైన స్థాయిల్లో ఉంచడానికి దోహదపడుతుంది. 


డీటాక్సిఫికేషన్‌

కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్‌  శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి, కడుపులో మంటను తగ్గిస్తాయి.


Updated Date - 2021-03-23T05:35:06+05:30 IST