ఆదాయం మస్తు

ABN , First Publish Date - 2022-01-28T05:18:56+05:30 IST

ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో ఒకటైన రిజిస్ట్రేషన్‌శాఖ నుంచి ప్రతీఏటా పెద్దఎత్తున ఆదా యం వస్తోంది..

ఆదాయం మస్తు

- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెరిగిన రిజిస్ట్రేషన్‌లు 

- అప్పుచేసి మరీ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న ప్రజలు

- మార్కెట్‌ విలువ పెరుగుతోందని ఆందోళన

ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌శాఖ ద్వారా ఈ మూడు రోజుల నుంచి ఆదాయం మస్తు పెరిగింది.  రాష్ట్ర ప్రభుత్వం అధిక ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు మరింత పెంచేందుకు కసరత్తు చేస్తున్న తరుణంలో భూమి క్రయవిక్రయ దారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు.  మూడ్రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలోని 12 సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా సాధారణ రోజుల కంటే ఈ ఆరు రోజుల నుంచి రెండింతలైంది. కానీ ఆరు నెలల క్రితమే భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచి మళ్లీ ఇప్పుడు పెంచుతారనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

మహబూబ్‌నగర్‌, జనవరి 27: ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో ఒకటైన రిజిస్ట్రేషన్‌శాఖ నుంచి ప్రతీఏటా పెద్దఎత్తున ఆదా యం వస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం అధిక ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేష న్‌ ఫీజులు మరింత పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది.. ఆరు నెలల క్రితమే భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంచడంతో ప్రజలపై తీవ్ర భారం పడింది. ఇప్పుడు మళ్లీ మార్కెట్‌ విలువలు పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో భూముల క్రయ, విక్రయాలు చేసుకునేవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో ధరలు ఫిబ్రవరిలో పెరుగు తాయని  ముందుగానే కొనుగోలు చేసిన భూములు, ఓపెన్‌ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు రిజిస్ట్రేష న్‌ కార్యాలయాలకు బారులు తీరుతున్నారు. మూడ్రో జుల నుంచి ఉమ్మడి జిల్లాలోని 12 సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద రద్దీ కనిపిస్తోంది. 

భూముల విలువలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఈ నెల 20,21 తేదీలలో పత్రికల్లో కథనాలు రావడంతో ఆ మరునాటి నుంచే అంటే 24,25,27 తేదీలలో రిజిస్ట్రేషన్‌ల సంఖ్య రెండింతలకు  పెరగడం విశేషం.  ఆదాయం ఎక్కువ గా ఉన్న మహబూబ్‌నగర్‌, జడ్చర్ల సబ్‌ రిజి స్ట్రేషన్‌ కార్యాలయాలలో రోజు జరిగే డాక్యుమెంట్‌ల కు రెండు,మూడింతల పెరగడం గమనార్హం. ఇదే స మయంలో ప్రభుత్వ ఖజనాకు కాసుల వర్షం కురు స్తోంది. 

 జడ్చర్ల సబ్‌రిజిస్ట్రేషన్‌ పరిధిలో ఈనెల 20వ తేదీన 61 డాక్యుమెంట్లు, 21న 66, 22న 107, 24న 104, 25న 161, 27న 160 డాక్యు మెంట్లు వచ్చాయి. తొలి మూడ్రోజుల్లో ఇక్కడ రూ.72 లక్షల ఆదాయం రాగా, తరువాత మూడ్రోజుల్లో రూ.కోటి ఆదాయం సమకూరింది. మహబూబ్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ పరిధి లో 20వ తేదీన 67, 21న 61, 22న 59, 24న 98, 25న 84, 27న 96 డాక్యుమెంట్లు వచ్చాయి. ఇక్కడ తొలి మూడ్రోజులల్లో రూ.57 లక్షల ఆదాయం రాగా, తరువాత మూడ్రోజుల్లో రూ.74 లక్షల ఆదాయం సమకూరింది. 

ఉమ్మడి జిల్లాలోని పలు సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాల యాల్లో డాక్యుమెంట్ల సంఖ్య పెరగడంతో పాటు ఆదా యం కూడా పెరిగుతోంది. రియల్‌ వ్యాపారులు వెంచర్లు చేసి వాళ్లే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తుంటారు. భూ ముల విలువలు పెరిగితే ఒక్కో ప్లాట్‌కు రూ.10-30 వేలు అదనపు భారం పడుతుందని ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని ఒప్పించి రిజిస్ట్రేషన్‌ లు చేయిస్తున్నారు. మరికొందరు రియాల్టర్లు ప్లాట్‌ల డబ్బులు తరువాత ఇచ్చినా ముందు రిజిస్ట్రేషన్‌ చేసు కోవాలని ఒత్తిడి  తెస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ అయ్యాక డాక్యుమెంట్లు తమ వద్దనే పెట్టుకొని డబ్బులు చెల్లించాక వాటిని తీసు కెళ్లండని ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. 




Updated Date - 2022-01-28T05:18:56+05:30 IST