హెటిరో కార్పొరేట్‌ ఆఫీస్‌లో భారీగా నగదు గుర్తింపు

ABN , First Publish Date - 2021-10-08T00:19:15+05:30 IST

హైదరాబాద్: హెటిరో డ్రగ్స్‌ ఐటీ సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. హెటిరో కార్పొరేట్‌ ఆఫీస్‌లో ఐటీ అధికారులు భారీగా నగదు గుర్తించారు.

హెటిరో కార్పొరేట్‌ ఆఫీస్‌లో భారీగా నగదు గుర్తింపు

హైదరాబాద్: హెటిరో డ్రగ్స్‌ ఐటీ సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. హెటిరో కార్పొరేట్‌ ఆఫీస్‌లో ఐటీ అధికారులు భారీగా నగదు గుర్తించారు. దొరికిన నగదుపై ఆరా తీస్తున్నారు. ట్యాక్స్‌ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. విదేశాల నుంచి హెటిరో పెద్ద మొత్తంలో ముడి సరుకు దిగుమతి చేసుకుంటున్నట్లు కూడా గుర్తించారు. ఎగుమతి, దిగుమతిలో భారీగా వ్యత్యాసాలున్నట్లు, విలువ తక్కువ చేసి ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్లు తేల్చారు. మెడిసిన్‌ తయారు చేస్తున్న కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించారు. శనివారం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. 

Updated Date - 2021-10-08T00:19:15+05:30 IST