మూడో రోజూ.. సోనూసూద్‌ ఇంట్లో ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2021-09-18T08:12:43+05:30 IST

మూడో రోజూ.. సోనూసూద్‌ ఇంట్లో ఐటీ సోదాలు శుక్రవారం ఉదయం నుంచి ముంబైలోని సోనూసూద్‌ నివాసం, నాగ్‌పూర్‌, జైపూర్‌లోని కార్యాలయాల్లో ఏకకాలంలో...

మూడో రోజూ.. సోనూసూద్‌ ఇంట్లో ఐటీ సోదాలు

ముంబై, సెప్టెంబరు 17:మూడో రోజూ.. సోనూసూద్‌ ఇంట్లో ఐటీ సోదాలు శుక్రవారం ఉదయం నుంచి ముంబైలోని సోనూసూద్‌ నివాసం, నాగ్‌పూర్‌, జైపూర్‌లోని కార్యాలయాల్లో ఏకకాలంలో జరిగాయి. ఇవి సోదాలే(సర్వే)నని దాడులు(రైడ్స్‌) కావని ఐటీ అధికారులు ప్రకటించారు. ఈ సోదాల్లో అధికారులు భారీ మొత్తంలో పన్ను ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది. బాలీవుడ్‌ చిత్రాలకు సంబంధించి తీసుకున్న పేమెంట్లు, వ్యక్తిగత ఆదాయం, రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించి సోనూసూద్‌ పన్నులను ఎగవేసినట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఆయన చారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. ‘‘లఖ్‌నవూలో ఓ స్థిరాస్తి సంస్థతో సోనూసూద్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో పన్ను ఎగవేత అనుమానాలున్నాయి. ఆ క్రమంలో బుధవారం నుంచి సర్వే ప్రారంభించాం’’ అని ఐటీ అధికారి ఒకరు విలేకరులకు తెలిపారు. కాగా.. సోనూసూద్‌పై కేంద్రంలోని బీజేపీ కక్ష కట్టిందని, అందుకే ఐటీ దాడులు చేయిస్తోందంటూ శివసేన అధికార పత్రిక సామ్నా ఓ కథనాన్ని ప్రచురించింది. విపక్షాలు కూడా కేంద్రం తీరుపై మండి పడుతున్నాయి.

Updated Date - 2021-09-18T08:12:43+05:30 IST