అసంపూర్తి పనులు అవస్థలో ప్రజలు

ABN , First Publish Date - 2022-01-18T05:36:28+05:30 IST

పాలకుల వైఫల్యం ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. కనిగిరి పట్టణంలో నగర పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలిపోయి పాలకుల తీరును ఎత్తిచూపుతున్నాయి. నగర పంచాయతీ పరిధిలో రూ. 1.20 కోట్లతో నగర పంచాయతీ కార్యాలయం నుంచి సూరాపాపిరెడ్డి చౌక్‌ వరకు సిమెంటురోడ్డు, సైడ్‌ డ్రైన్‌ నిర్మించ తలపెట్టారు. ఆపనిని ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పచెప్పిన పాలకవర్గం నగర పంచాయతీ కార్యాలయం నుంచి నగరికంటి బసవయ్య సెంటర్‌ వరకు ఒక కాంట్రాక్టర్‌, నగరికంటి బసవయ్య సెంటర్‌ నుంచి సూరాపాపిరెడ్డిచౌక్‌ వరకు మరో కాంట్రాక్టర్‌ ఖరారు చేసుకొని పనులు ప్రారంభించారు.

అసంపూర్తి పనులు  అవస్థలో ప్రజలు
బొడ్డుచావిడి నుంచి నగరికంటి బసవయ్య సెంటర్‌ వరకు గుంతలుగా మారిన రోడ్డు

లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం

 కనిగిరి, జనవరి 17: పాలకుల వైఫల్యం ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. కనిగిరి పట్టణంలో నగర పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలిపోయి పాలకుల తీరును ఎత్తిచూపుతున్నాయి. నగర పంచాయతీ పరిధిలో రూ. 1.20 కోట్లతో నగర పంచాయతీ కార్యాలయం నుంచి సూరాపాపిరెడ్డి చౌక్‌ వరకు సిమెంటురోడ్డు, సైడ్‌ డ్రైన్‌  నిర్మించ తలపెట్టారు.  ఆపనిని ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పచెప్పిన పాలకవర్గం నగర పంచాయతీ కార్యాలయం నుంచి నగరికంటి బసవయ్య సెంటర్‌ వరకు ఒక కాంట్రాక్టర్‌, నగరికంటి బసవయ్య సెంటర్‌ నుంచి సూరాపాపిరెడ్డిచౌక్‌ వరకు మరో కాంట్రాక్టర్‌ ఖరారు చేసుకొని పనులు ప్రారంభించారు. నగరికంటి బసవయ్య సెంటర్‌ నుంచి సూరాపాపిరెడ్డిచౌక్‌ వరకు సైడ్‌ డ్రైన్‌లు, సిమెంట్‌ రోడ్డు పనులు పూర్తయ్యాయి. అయితే నగర పంచాయతీ కార్యాలయం నుంచి నగరికంటి బసవయ్య సెంటర్‌ వరకు జరగాల్సిన పనులు మాత్రం బొడ్డుచావిడి వద్దకు వచ్చి ఆగిపోయాయి. రోడ్డు వెంట ఉండే షాపులు, భవన యజమానులు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిపి వేశారు. దీంతో చిన్నపాటి వర్షం పడినా అసంపూర్తిగా వదిలేసిన రోడ్డంతా గుంతలుగా మారి నీరు నిలిచిపోతోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు స్పందించి అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  



Updated Date - 2022-01-18T05:36:28+05:30 IST