Puneeth Rajkumar మరణం తర్వాత కర్ణాటక రాష్ట్రంలో వింత పరిణామం..

ABN , First Publish Date - 2021-11-05T21:29:03+05:30 IST

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గత నెల 29న జిమ్‌లో వ్యాయామం చేస్తూ కార్డియాక్ అరెస్ట్ కారణంగా హఠాత్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, పలువరు రాజకీయ, సినీ ప్రముఖులు భావేద్వేగానికి లోనయ్యారు. కన్నీటితో పునీత్ రాజ్‌

Puneeth Rajkumar మరణం తర్వాత కర్ణాటక రాష్ట్రంలో వింత పరిణామం..

ఇంటర్నెట్ డెస్క్: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గత నెల 29న జిమ్‌లో వ్యాయామం చేస్తూ కార్డియాక్ అరెస్ట్ కారణంగా హఠాత్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, పలువరు రాజకీయ, సినీ ప్రముఖులు భావేద్వేగానికి లోనయ్యారు. కన్నీటితో పునీత్ రాజ్‌కుమార్‌కు తుది వీడ్కోలు పలికారు. పునీత్ మరణించి దాదాపు వారం రోజులు గడుస్తున్నా.. అతడి అభిమానాలు మాత్రం ఆ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. కన్నడ సూపర్ స్టార్ మరణం తర్వాత కర్ణాటకలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. దీంతో వింత పరిణామం అక్కడ చోటు చేసుకుంది. కాగా.. పునీత్ కన్నుమూసిన తర్వాత అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే.. 



పునీత్ రాజ్‌కుమార్‌కు కన్నడ సినీ పరిశ్రమలో ప్రత్యేక ఈమేజ్ ఉంది. తన నటనతో లక్షలాది మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నాడు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించే పునీత్..  జిమ్‌లో కసరత్తులు చేస్తూ కార్డియాక్ అరెస్ట్‌ కారణంగా అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన అనేక మంచి పనులతో పాటు వ్యాయామం చేస్తున్న కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో.. కర్ణాటకలో వింత పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు ఆసుపత్రులు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. పునీత్ మరణం తర్వాత తీవ్ర భయాందోళనలకు గురవుతున్న ప్రజలు.. గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. 


ఈ విషయాన్ని ఆసుపత్రులు కూడా ధ్రువీకరిస్తున్నాయి. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతు.. పునీత్ ఆకస్మిక మరణం తర్వాత హృదయ సంబంధ చెకప్‌ల కోసం తమ ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య 30-35శాతం పెరిగినట్లు వెల్లడించారు. రోజుకు సుమారు 1200 మంది ప్రజలు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వస్తున్నట్టు చెప్పారు. రాష్ట అవతరణ దినోత్సవ నేపథ్యంలో నవంబర్ 1న పబ్లిక్ హాలిడే అయినప్పటికీ ఆ రోజు సుమారు 1700 మంది ప్రజలు ఆసుపత్రిని సందర్శించినట్లు పేర్కొన్నారు. మరో ప్రముఖ ఆసుపత్రిలో కూడా పరిస్థితి ఇలానే ఉందని సదరు ఆసుపత్రి ప్రతినిధులు పేర్కొన్నారు. 



ఇదిలా ఉంటే.. భారత్‌లో హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న యువకుల సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇండియాలో 30శాతం గుండెపోటులు 40ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలోనే వస్తున్నాయని ఓ సర్వేలో వెల్లడైందని పేర్కొన్నారు. అందువల్ల 35 ఏళ్లు పైబడిన పురుషులు మరియు 45 ఏళ్లు పైబడిన మహిళలు హృదయ సంబంధిత పరీక్షలు చేయించుకోవడంలో తప్పులేదన్నారు. పునీత్ రాజ్‌కుమార్ సెలబ్రెటీ కావడం అందులోనూ ఫిట్‌‌గా ఉండేందుకు కఠిమైన వ్యాయామాలు చేసూ ఉంటాడు. అంతటి శారీర ధృడత్వం కలిగన రాజ్‌పుతే కార్దియాక్ అరెస్ట్‌కు గురై మరణిస్తే ఇక తమ పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రులకు తాకిడి ఎక్కువైందని వివరిస్తున్నారు. అయితే ప్రజలు అనవసరంగా గాబరా పడాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తూ కొలెస్ట్రాల్, బీపీ, సుగర్ వంటి రిస్క్ ఫ్యాక్టర్లను కంట్రోల్‌లో ఉంచుకోవాలని చెబుతున్నారు. అంతేకాకుండా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే మేలని సూచిస్తున్నారు. 




Updated Date - 2021-11-05T21:29:03+05:30 IST