ఏపీ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచండి

ABN , First Publish Date - 2021-06-17T09:30:59+05:30 IST

ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు విన్నవించారు

ఏపీ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచండి

సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు విజ్ఞప్తి 

హైదరాబాద్‌లో భేటీ.. సీజేఐకు సన్మానం 


విజయవాడ లీగల్‌, జూన్‌ 16: ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు విన్నవించారు. బుధవారం హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌లో సీజేఐను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణను రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఘంటా రామారావు, ఆల్‌ ఇండియా బార్‌ కౌన్సిల్‌ సభ్యులు రామిరెడ్డి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్‌, ఎస్‌.బ్రహ్మానందరెడ్డి, చిదంబరం, చిత్తర్వు నాగేశ్వరరావు, వజ్జే శ్రీనివాసరావు, రోళ్ల మాధవి, రవిజువేరా, సుదర్శనం తదితరులు సన్మానించారు. ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి జస్టిస్‌ ఎన్వీ రమణ సానుకూలంగా స్పందించారు. 

Updated Date - 2021-06-17T09:30:59+05:30 IST