ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం పెంపు

ABN , First Publish Date - 2020-09-23T07:35:18+05:30 IST

దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని కేంద్రం 301 మిలియన్‌ టన్నులకు పెంచింది. ఇది నిరుటి కంటే నాలుగు మిలియన్‌ టన్ను లు ఎక్కువ.

ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం పెంపు

నూనెగింజల దిగుమతి తగ్గించేందుకు టార్గెట్‌


న్యూఢిల్లీ: దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని కేంద్రం 301 మిలియన్‌ టన్నులకు పెంచింది. ఇది నిరుటి కంటే నాలుగు మిలియన్‌ టన్ను లు ఎక్కువ. రుతుపవనాలు బాగుండడం, వర్షాలు కురవడం, ఖరీ్‌ఫలో ఆ శించిన దానికంటే ఎక్కువ ఎకరాల్లో పంట వేయడం.. మొదలైనవి పరిగణించిన మీదట ఖరీఫ్‌ పంటలకు ఈ టార్గెట్‌ను పెంచినట్లు వ్యవసాయమంత్రి నరేంద్ర తోమర్‌ చెప్పారు.

నూనెగింజల దిగుమతిని తగ్గించే లక్ష్యం తో దేశంలో ప్రధాన ఆయిల్‌సీడ్‌ అయిన ఆవాలు ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా 9.2మిలియన్‌ టన్నుల నుంచి 12..5మిలియన్‌ టన్నులకు పెంచామన్నా రు. 


Updated Date - 2020-09-23T07:35:18+05:30 IST