క్రీడలపై యువత ఆసక్తి పెంచుకోవాలి : బీర్ల

ABN , First Publish Date - 2022-01-24T05:49:08+05:30 IST

క్రీడలపై యువత ఆసక్తి పెంచు కుని జాతీయ క్రీడాకారులుగా రాణించాలని కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు బీర్ల అయిలయ్య అన్నారు. భజరంగ్‌ యూత్‌ అసొసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల ఆలేరులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్‌

క్రీడలపై యువత ఆసక్తి పెంచుకోవాలి : బీర్ల
బహుమతులు అందజేస్తున్న బీర్ల అయిలయ్య

ఆలేరు, జనవరి 23: క్రీడలపై యువత ఆసక్తి పెంచు కుని జాతీయ క్రీడాకారులుగా రాణించాలని కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు బీర్ల అయిలయ్య అన్నారు. భజరంగ్‌ యూత్‌ అసొసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల ఆలేరులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. రఘ వాపురం గ్రామయూత్‌ క్రికెట్‌ జట్టు(ప్రథమ), ఆలేరు ఫ్రెండ్స్‌ క్లబ్‌ జట్టు(ద్వితీయ) బహుమతులు అందజే శారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వెంకటేశ్వర రాజు, ఎంఎ. ఎజాజ్‌, అజయ్‌, బీమగాని ప్రభు, శ్రీను, ఎండీ బాబా, భాస్కర్‌, సుంకరి విక్రమ్‌, రాహుల్‌, జావిద్‌, మహేశ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:49:08+05:30 IST