దళిత, బీసీ, మైనార్టీలపై పెరిగిన దాడులు

ABN , First Publish Date - 2020-07-04T10:02:09+05:30 IST

రాష్ట్రంలో ఏడాదికాలంగా దళితులు, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను కట్టడి చేయడంలో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం పూర్తిగా

దళిత, బీసీ, మైనార్టీలపై పెరిగిన దాడులు

నేడు కొవ్వొత్తులతో నిరసన: యరపతినేని 


పిడుగురాళ్ల, జూలై 3: రాష్ట్రంలో ఏడాదికాలంగా దళితులు, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను కట్టడి చేయడంలో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం  పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం పిన్నెల్లితోపాటు పలుగ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్నో కుటుం బాలవారు వైసీపీ నాయకుల బెదిరింపులు, దాడులకు భయపడి ఊరొదిలి వెళ్లార న్నారు. ఏడాది గడిచినా ఇంతవరకు వారిని స్వగ్రామాలకు తీసుకురావటంలో, ఇప్పటికీ పలు గ్రామాల్లో వైసీపీ వారు చేస్తున్న దాడుల్లో తెలుగుదేశం పార్టీవారు దెబ్బలు తగిలి పోలీసుస్టేషన్‌కు వెళ్తున్నా ఫిర్యాదులు కూడా తీసుకోని పరిస్థితులు పల్నాడులో ఇంకా ఉన్నాయన్నారు.


మాచవరం ఎస్‌ఐ వైసీపీ వర్గాల వారికి వంత పాడుతూ వారుచేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రోత్సహిస్తున్నాడని యరపతినేని పేర్కొన్నారు. అంబాపురానికి చెందిన దళిత యువకుడు దోమతోటి విక్రమ్‌ను పోలీస్టేషన్‌కు పిలిపించి అర్ధరాత్రి వరకు ఉంచి పంపించటం వలనే అతని హత్య జరిగిందన్నారు. ఏడాదికాలంలో గురజాల నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో 80 మందిపై దాడులు జరగటంవల్ల కాళ్లు, చేతులు విరిగిపోవటమేకాకుండా ఆస్తులుకూడా ధ్వంసం అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఇంత జరు గుతున్నా వైసీపీ నాయకుల దుర్మార్గపు చర్యలను అదుపుచేయటంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలం చెందిందన్నారు. పల్నాడు ప్రాంతంలో జరిగిన హత్య, దాడులను ప్రతి ఒక్కరూ ఖండించటంతోపాటు శనివారం సాయంత్రం 7 గంటలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామాల్లో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని సూచించారు.

Updated Date - 2020-07-04T10:02:09+05:30 IST