మళ్లీ పెరిగిన చికెన్‌ ధర

ABN , First Publish Date - 2020-05-18T10:27:00+05:30 IST

నగరంలో చికెన్‌ ధర ఒక్కసారిగా పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందు చికెన్‌ తింటే కరోనా వస్తుందన్న భయంతో ఎవరూ చికెన్‌ ..

మళ్లీ పెరిగిన చికెన్‌ ధర

 కిలో చికెన్‌ రూ.320


సుభాష్‌నగర్‌, మే 17: నగరంలో చికెన్‌ ధర ఒక్కసారిగా పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందు చికెన్‌ తింటే కరోనా వస్తుందన్న భయంతో ఎవరూ చికెన్‌ కొనకపోవడంతో చికెన్‌ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. లాక్‌డౌన్‌ ముందు వరకు కిలో చికెన్‌ 50రూపాయలు ఉండేది. చికెన్‌ తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడడంతో ప్రజలు చికెన్‌ కొనడం క్రమక్రమంగా పెరిగింది.


అయితే కూరగాయలతో పాటు మటన్‌, చికెన్‌ను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఎప్పడికప్పుడు పర్యవేక్షించారు. అయితే కొద్ది రోజుల నుంచి చికెన్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారం నాడు ఏకంగా కిలో చికెన్‌ రూ.320లకు పెరిగింది. దీనితో ప్రజలు చికెన్‌ను కొనేందుకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై అధికారులు దృష్టిసారించి ధరలను అదుపులో ఉంచేలా ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-05-18T10:27:00+05:30 IST