Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుడ్డుకు పెరిగిన డిమాండ్‌

రూ.7కు చేరిన రిటైల్‌ ధర


న్యూఢిల్లీ: కొవిడ్‌ 2.0 కొన్ని రంగాలకు మాత్రం మేలు చేస్తోంది. అందులో కోళ్ల పరిశ్రమ ఒకటి. ప్రొటీన్లు దం డిగా ఉండే ఆహారం తింటే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందన్న నిపుణుల సూచనలతో  కోడిగుడ్లకు డిమాండు విపరీ తంగా పెరిగిపోయింది. రెండు నెలల క్రితం కోడిగుడ్డు రిటైల్‌ ధర  రూ.4.5 నుంచి రూ.5 మధ్యలో పలికింది. ఇప్పుడది ఆరేడు రూపాయలకు చేరింది. బ్రాండెడ్‌ గుడ్ల ధర అయితే ఒక్కోటి రూ.10 పైనే పలుకుతోంది.


వారానికి సగటున 7 గుడ్ల వినియోగం

మన దేశంలో ఒక్కో వ్యక్తి  వారానికి సగటున ఏడు గుడ్లు వినియోగిస్తాడని అంచనా. బర్డ్‌ ఫ్లూ భయంతో ఈ ఏడాది  జనవరి-ఫిబ్రవరిలో ఇది నాలుగుకు పడిపోయింది. దీంతో రైతులు ముందుజాగ్రత్త చర్యగా కొత్త బ్యాచ్‌లు పెంచడం తగ్గించారు. దాంతో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇపుడు గుడ్ల ఉత్పత్తి తగ్గింది. ఇది కూడా గుడ్ల ధరపై  ప్రభావం చూపుతోంది. 


రైతుకి నష్టమే: గుడ్ల రిటైల్‌  ధర  రూ.7-8కు చేరినా, రైతులకు మాత్రం పెద్దగా ఆ ప్రయోజనం అందడం లేదు. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ఉత్పత్తికి నాలుగున్న రూపాయలు ఖర్చవుతుంటే రైతులకు రూ.5కు మించి లభించడం లేదు. పెరిగిన ధరలో ఎక్కువ భా గం మధ్య దళారీలకే పోతోందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. 


కొండెక్కిన సోయా చెక్క ధర: దాణాలో ప్రధాన ముడి పదార్ధమైన సోయా చెక్క ధర చుక్కలంటింది. రెండు నెలల క్రితం టన్ను రూ.33,000 నుంచి రూ.40,000 మధ్య ఉన్న సోయా చెక్క, ప్రస్తుతం రూ.72,000 దాకా పలుకుతోంది. దీంతో గుడ్ల ధర కొద్దో గొప్పో పెరిగినా, రైతులకు  పెద్దగా లాభం లేకుండా పోయిందని చెబుతున్నారు. Advertisement
Advertisement