భద్రాద్రికి పెరిగిన భక్తుల సంఖ్య

ABN , First Publish Date - 2021-01-18T08:02:48+05:30 IST

భద్రాద్రికి పెరిగిన భక్తుల సంఖ్య

భద్రాద్రికి పెరిగిన భక్తుల సంఖ్య

6లక్షల విలువైన ఆభరణాలు సమర్పించిన రాజమండ్రి భక్తులు


భద్రాచలం, జనవరి 17: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గత ఐదు రోజుల్లో సుమారు 40వేల మంది రామయ్యను దర్శించుకున్నారు. దీంతో దేవస్థానానికి రూ.30 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఆదివారం రామయ్యకు నిర్వహించిన మూలవరుల అభిషేకం, సువర్ణ పుష్పపూజ, నిత్యకళ్యాణాల్లోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి చెందిన కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు(ఐఎ్‌ఫఎస్‌) ఎన్‌.నాగేశ్వరరావు రామయ్యకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అదే పట్టణానికి చెందిన భక్తులు వీవీవీఎస్‌ చౌదరి, అమ్మాజీ దంపతులు.. సుమారు 6లక్షల విలువైన 30గ్రాముల గుండ్ల హారం, 28 గ్రాముల నెక్లెస్‌, 20 గ్రాములు, 15గ్రాముల 2 ముత్యాలహారాలు స్వామివారికి సమర్పించారు. 

Updated Date - 2021-01-18T08:02:48+05:30 IST