మదనపల్లె టౌన్, జనవరి 16: మదనపల్లె టమోటా మార్కెట్‌లో శనివారం టమోటా ధరలు స్వల్పంగా పెరిగాయి. వారంరోజులుగా మొదటి రకం టమోటా ధర గరిష్టంగా కిలో రూ.14 పలకగా, రెండో రకం కనిష్టంగా రూ.4 మాత్రమే పలికాయి. కాగా శనివారం మొదటిరకం గరిష్ట ధర కిలో రూ.19, రెండో రకం కనిష్ట ధర కిలో రూ.8 పలికింది. వారం ముందు మార్కెట్‌కు 200 టన్నుల టమోటా విక్రయానికి రాగా, శనివారం కేవలం102 టన్నుల టమోటా విక్రయానికి వచ్చింది. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి కిలోకు సరాసరిన రూ.5 పెరిగినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి.