పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-04-20T05:43:06+05:30 IST

జిల్లాలో రోజురోజుకు కరోనా వైరస్‌ ఉధృమవుతోంది. సగటున రోజుకు 500కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతు న్నాయి.

పెరుగుతున్న కరోనా కేసులు

 - జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు

- ప్రభుత్వ, ప్రైవేటులో కరోనా చికిత్సకు 303 బెడ్లు

- అందుబాటులో 173 బెడ్లు

- ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సౌకర్యం  

జగిత్యాల, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోజురోజుకు కరోనా వైరస్‌ ఉధృమవుతోంది. సగటున రోజుకు 500కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతు న్నాయి. కరోనా చికిత్సకు అవసరమైన అన్ని సౌకర్యాలు జిల్లాలో ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.  జిల్లాలో ఉన్న వైద్య సౌకర్యాలపై అవగాహన లేకపో వడంతో కొవిడ్‌ వచ్చిన వారు చాలా మంది చికిత్సకు ఇతర నగరాలకు వెళ్తున్నారు. అవసరం లేకున్నా దూర ప్రాంతాలకు వెళ్లి కార్పొరేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తు న్నారు. జిల్లాలోని వైద్య సౌకర్యాలను వినియోగించు కోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజల్లో అవగా హన కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

జిల్లాలో 303 బెడ్లు ఏర్పాటు

జగిత్యాల జిల్లాలోని ప్రధాన పట్టణాలైన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలలో ఏర్పాటు చేసిన పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగులకు చికిత్స అందిం చడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రస్తుతం 303 బెడ్లు ఉండగా ఇందులో ప్రస్తుతం 173 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 130 బెడ్లలో కొవిడ్‌ రోగులకు చికిత్స అందు తోంది. జిల్లాలో గల 303 బెడ్లలో రెండు ప్రభుత్వ ఆసుప త్రుల్లో 107 బెడ్లు, 8 ప్రైవేటు ఆసుపత్రుల్లో 196 బెడ్లు ఏర్పాటు చేశారు. జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో 65 బెడ్లు, మెట్‌పల్లి సీహెచ్‌సీలో 42 బెడ్లున్నాయి. మరో మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో 90 బెడ్లకు అనుమతి లభించనుంది.  

అందుబాటులో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు

జిల్లాలో కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. రోగులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్‌ అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి  ఆక్సిజన్‌ బెడ్‌కు రెండు చొప్పున సిలెండర్లు అందు బాటు లో ఉంచారు. జిల్లాలో 108 ఆక్సిజన్‌ బెడ్లున్నాయి. ఇందు లో 73 బెడ్లలో రోగులు చికిత్స పొందుతున్నారు. 25 ఆక్సిజన్‌ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. అవసరమైన సమ యాల్లో వినియోగించుకోవడానికి వెంటిలేటర్లు అందు బాటులో ఉంచారు. హైఫ్లోనాసల్‌ క్యాన్సల్స్‌ సైతం ఆసుపత్రుల్లో ఉన్నాయి. 

అవసరమైతే ఇతర ప్రాంతాలకు రెఫర్‌

జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రులకు వచ్చిన రోగుల్లో అత్యవసరమైతే ఇతర ప్రాంతాలకు రెఫర్‌ చేస్తున్నారు.  శ్వాసకోశ తీవ్ర సమస్యలకు గురికావడం, కార్డియాలజీ, నెఫ్రాలజీ వంటి ప్రత్యేక జబ్బులు తోడవడం వంటి పరిస్థితులు ఎదురయితే రెఫర్‌ చేయాల్సి వస్తోందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య కోసం హైదాబ్రాద్‌ వంటి నగరాలకు రెఫర్‌ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. 


 వసతులు సద్వినియోగం చేసుకోవాలి

- పుప్పాల శ్రీధర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జగిత్యాల

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హోం ఐసోలేషన్‌ సౌకర్యం లేని వారి కొరకు కొండగట్టు వద్ద గల జేఎన్‌టీయూలో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశాం. చికిత్స అవసరమైన రోగుల కొరకు మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాలలో బెడ్లు అందుబాటులో ఉంచుతున్నాం. ఎటువంటి బెంగ లేకుం డా వసతులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - 2021-04-20T05:43:06+05:30 IST