పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-26T05:21:55+05:30 IST

కంభం, అర్ధవీడు మండలాల్లో రోజురోజుకూ కరోనా కేసులు భా రీగా పెరుగుతున్నాయి. రెండు మండలాల్లో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

పెరుగుతున్న కరోనా కేసులు
వైపాలెంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

కంభం, అర్ధవీడు  మండలాల్లో భారీగా నమోదు

కంభం ప్రభుత్వ వైద్యశాలలో మంది సిబ్బందికి వ్యాప్తి

వైపాలెంలో 24 గంటల్లో 104 మందికి పాజిటివ్‌

కంభం, జనవరి 25 : కంభం, అర్ధవీడు మండలాల్లో రోజురోజుకూ కరోనా కేసులు భా రీగా పెరుగుతున్నాయి. రెండు మండలాల్లో అధికారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఒక్కరోజే కంభం మండలంలో 22, అర్ధవీడు మండలంలో 8 కరోనా కేసులు అధికారికంగా వెలువడ్డాయంటే ఇంక వైద్యశాలలకు వెళ్లకుండా, ఎటువంటి టెస్టులు చేయించుకోకుండా కరోనా లక్షణాలతో ఎంతమంది ఉ న్నారోనని పలువురు ఆందోళన చెందుతున్నా రు. తాజాగా కంభం 50 పడకల ప్రభుత్వ వైద్యశాలలో వైద్యశాల సూపరింటెండెంట్‌తోసహా ఇద్దరు డాక్టర్లు, 6 మంది సిబ్బంది మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వెంటనే హోం ఐసోలేషన్‌లో ఉండగా మిగిలిన సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో, పాఠశాలల్లో సిబ్బందికి, పిల్లలకు కరోనా వచ్చిందనే పుకార్లు లేవడంతో అటు రోగులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలందరూ మా స్కులు ధరించి భౌతికదూరం పాటించాలని సంబంధిత అధికారులు, పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నా రు. పోలీసులు, సంబంధిత అధికారులు ఇ ప్పటికైనా మాస్కులు ధరించకుండా తిరిగే వా రికి, కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

హోటళ్లలో తనిఖీ

గిద్దలూరు టౌన్‌ : నగర పంచాయతీ కమి షనర్‌ రామకృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళవా రం పట్టణంలోని రెస్టారెంట్లు, హోటళ్లు, సిని మా హాళ్లను శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ నాయబ్‌రసూల్‌ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, థియేటర్లకు, హోటళ్లకు వచ్చే వారికి మా స్కులు ఉండేలా చూ డాలని సూచించారు. షా పుల ముందు, హోటళ్ల ముందు నో మాస్క్‌ నో ఎం ట్రీ బోర్డులు పెట్టాలని, కౌం టర్ల వద్ద శానిటైజర్లు ఉం చాలని, మూత్రాశయాలను ప్రతిరోజు పినాయిల్‌తో శుభ్రం చేయాలని అన్నారు. ఆయన వెంట స చివాలయ కార్యదర్శులు నాగభూషణం, నారాయణ పాల్గొన్నారు. 

కొంగళవీడులో ఫాగింగ్‌

మండలంలోని కొంగళవీడు గ్రామంలో మంగళవారం సర్పంచ్‌ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యం లో గ్రామంలో ఫాగింగ్‌ నిర్వహించారు. ప్రతి వీధిలో ఫాగింగ్‌ చేస్తూ బ్లీచింగ్‌ చల్లారు. మంచినీటి ట్యాంక్‌లను క్లీన్‌ చేశారు. ఈసందర్భంగా సర్పంచ్‌ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని, కరోనా కట్టడికి సహకరించాలని, పంచాయతీ పరిధిలో నిత్యం బ్లీచింగ్‌లు, ఫా గింగ్‌ చేస్తున్నామని తెలిపారు.

104 మందికి పాజిటివ్‌

ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాలో 24వ తేదీ ఉదయం 9 నుంచి 25వ తేదీ 9 గంటల వర కు చేసిన పరీక్షల్లో 104 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డాక్టర్లు తెలిపారు.   వైపాలెం మండలంలో 45 మందికి, పుల్లలచెరువు మండలంలో 14 మందికి,  త్రిపురారంతకం మండలంలో 17 మందికి, పెద్దారవీడు మండలంలో 13 మందికి, దోర్నాల మండలంలో 15 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు ప్రకటించారు.


Updated Date - 2022-01-26T05:21:55+05:30 IST