పెరగనున్న సాగు

ABN , First Publish Date - 2020-05-09T10:17:58+05:30 IST

జిల్లాలో ఏడాది వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడడంతో గడిచిన రెండు సీజన్లలో సాగు విస్తీర్ణం పెరగగా, రానున్న

పెరగనున్న సాగు

వర్షాకాలంలో 1,14,939 హెక్టార్లలో సాగవుతుందని అంచనా

విత్తనాలు, ఎరువులకు ప్రతిపాదనలు పంపిన అధికారులు

త్వరలో రైతుబంధు సాయం విడుదల


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): జిల్లాలో ఏడాది వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడడంతో గడిచిన రెండు సీజన్లలో సాగు విస్తీర్ణం పెరగగా, రానున్న వర్షాకాలం సీజన్‌లో గ తంలో కంటే ఎక్కువ మొత్తంలో 1,14,939 హెక్టార్ల లో వరి, మొక్కజొన్న, పత్తి, తదితర రకాల పంట లను సాగు చేయనున్నారని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో రుతు పవనాలు ముందస్తుగానే రాష్ట్రంలో ప్రవేశి స్తాయని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొం టున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీళ్లే కాకుండా జిల్లాకు ఈ సీజన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రానుండడంతో సాగు అధికంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.


జిల్లాలో ఇప్పటి వరకు వానా కాలం పంట సాగు లక్షలోపు హెక్టార్లలో మాత్రమే అయ్యింది. ఈసారి సాగు నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో విస్తీర్ణం పెరగనున్నదని, ఆ మేరకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల కోసం వ్యవసాయ శాఖాధికారులు సన్నాహాలు చేస్తున్నా రు. సాగుకు దన్నుగా ప్రభుత్వం రైతుబంధు సా యం కింద ప్రతి ఎకరాకు 5వేల రూపాయలు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నది. దీనికి సంబంధిం చిన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. రైతు రుణమాఫీకి సంబంధించి 25 వేల రూపా యలలోపు రుణాలు ఉన్న వారికి ఏకకాలంలో మాఫీ చేస్తుండగా, ఆపైన రుణాలు పొందిన వారికి మాత్రం నాలుగు విడతల్లో రుణ మాఫీ సొమ్మును ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. జిల్లాలో 1,64,850 హెక్టార్ల భూమి సాగుకు యోగ్యమైన భూమి ఉండగా, సాధా రణంగా 82,293 హెక్టార్లలో సాగు కానున్నది. జిల్లాలో నీటి వనరులు పెరుగుతుండడంతో వచ్చే వానా కా లంలో జిల్లావ్యాప్తంగా 1,14,939 హె క్టార్లలో సాగు చేయనున్నారని వ్యవ సాయ శాఖాధికారులు అంచనా వే స్తున్నారు.


ఇందులో 77,960 హెక్టార్లలో వరి, 1,727 హెక్టార్లలో మొక్కజొన్న, 273 హెక్టార్లలో కంది, 225 హెక్టార్లలో పెసర, 31,122 హెక్టార్లలో పత్తి, 316 హెక్టార్లలో మిర్చి, 602 హెక్టార్లలో పసుపు. 126 హెక్టార్లలో ఇతర పంటలు, 2,588 హెక్టార్లలో కూరగాయల పంటలను రైతులు సాగుచేయనున్నారని అధికా రులు అంచనా వేస్తున్నారు. ఇం దులో పెద్దపల్లి మండలంలో 16,471 హెక్టార్లు, జూలపల్లిలో 7,299 హె క్టార్లు, సుల్తానాబాద్‌లో 10,819 హెక్టార్లు, ఓదెలలో 11,806 హెక్టార్లు, కాల్వ శ్రీరాం పూర్‌లో 11,552 హెక్టార్లు, ఎలిగేడులో 5,571 హెక్టార్లు, రామగుండంలో 1,188 హెక్టార్లు, ధర్మారంలో 11,206 హెక్టార్లు, పాలకుర్తిలో 6,133 హెక్టార్లు, అంతర్గాంలో 4,135 హెక్టార్లు, మంథనిలో 14,143 హెక్టా ర్లు, ముత్తారంలో 6,740 హెక్టార్లు, కమాన్‌ పూర్‌లో 3,572 హెక్టార్లు, రామగిరి మండలం లో 4,304 హెక్టార్లలో సాగు చేయనున్నారని అంచనాలు రూపొందించారు.


69,500 టన్నుల ఎరువులకు ప్రతిపాదనలు..

వచ్చే వర్షాకాలంలో జిల్లాలో సాగు కానున్న పం టలకు 69,500 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవస రం అవుతాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. 8 వేల టన్నుల డీఏపీ, 20,500 ట న్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 34,500 టన్నుల యూ రియా, మ్యూరెట్‌ ఆఫ్‌ పొటాష్‌ 6,500 టన్నులు అవసరం ఉంటుందని ప్రతిపాదించారు. ఈ నెలలో 7 వేల టన్నులు. జూన్‌లో 15,500 టన్నులు, జూలై లో 16 వేల టన్నులు, ఆగస్టులో 16,500 టన్నులు, సెప్టెంబర్‌లో 14,500 టన్నుల ఎరువులు సరఫరా కానున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి 21,914 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నా యని, వాటిలో యూరియా 10,331 టన్నులు, డీఏపీ 3293 టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 7,682 టన్ను లు, ఎంఓపీ 434 టన్నులు, సూపర్‌ ఫాస్ఫేట్‌ 171 టన్నులు అందుబాటులో ఉందని అధికారులు పేర్కొన్నారు. 


14,400క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సిద్ధం..

జిల్లాలో వివిధ రకాల పంటలను సాగు చేయనున్న రైతులకు సబ్సిడీ విత్తనాలను అందజేసేందుకు ప్రభుత్వం విత్తనాలను సరఫరా చేస్తున్నది. వరి విత్తనాలు 11 వేల క్వింటాళ్లు, 60 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు, కంది 50 క్విం టాళ్లు, పెసర 68 క్వింటాళ్లు, మిను ములు 50 క్వింటాళ్లు పచ్చి రొట్ట ఎరువులు 3,172 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై ఇవ్వనున్నారు. 


Updated Date - 2020-05-09T10:17:58+05:30 IST