పెరుగుతున్న పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2022-01-20T05:17:15+05:30 IST

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. థర్డ్‌వేవ్‌లో కేసుల నమోదు ఉధృతి మొదలైందనే చెప్పవచ్చు.

పెరుగుతున్న పాజిటివ్‌లు

- ఉమ్మడి జిల్లాలో 1,403 కరోనా కేసులు నమోదు

- కరీంనగర్‌లో 367 మందికి వైరస్‌


సుభాష్‌నగర్‌, జనవరి 19: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. థర్డ్‌వేవ్‌లో కేసుల నమోదు ఉధృతి మొదలైందనే చెప్పవచ్చు. బుధవారం ఉమ్మడి జిల్లాలో 8,390 మందికి పరీక్షలు నిర్వహించగా 1,403 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 704 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. సుమారు 7 నెలల తర్వాత ఇంత అధిక సంఖ్యలో కేసులు నమోదవడం తొలిసారి. పెద్దపల్లి జిల్లాలో 2,382 మందికి పరీక్షలు నిర్వహించగా 704 మందికి, కరీంనగర్‌ జిల్లాలో 2,232 మందికి పరీక్షలు నిర్వహించగా 367 మందికి, జగిత్యాల జిల్లాలో 2,430 మందికి పరీక్షలు నిర్వహించగా 151 మందికి, సిరిసిల్ల జిల్లాలో 1,265 మందికి పరీక్షలు నిర్వహించగా 181 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సంక్రాంతి పండగ సందర్భంగా చాలామంది పట్టణాల నుంచి పల్లెలకు చేరుకొని పండగ జరుపుకున్నారు. పండగ ముగిసిన రెండు రోజుల తర్వాత నుంచి కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతూ వస్తున్నది. వైద్యశాఖ, ప్రభుత్వం ప్రజలకు సూచనలను చేస్తున్నప్పటికి వాటిని పట్టించుకోకపోవడమే వ్యాధివ్యాప్తికి కారణమని వైద్యశాఖ విచారం వ్యక్తం చేస్తోంది. ప్రజలు ఇప్పటికైనా విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ చేతులను సానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, గుంపులు గుంపులుగా ఉండకూడదని, శుభకార్యాల్లో పరిమిత సంఖ్యలో పాల్గొనాలని సూచిస్తున్నారు.




Updated Date - 2022-01-20T05:17:15+05:30 IST