Abn logo
Apr 9 2021 @ 02:46AM

పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం

తిరుపతి(కొర్లగుంట), ఏప్రిల్‌ 8: ఎండలతో విద్యుత్తు వినియోగం పెరుగుతున్నట్లు సదరన్‌ డిస్కం సీఎండీ హెచ్‌.హరనాథరావు గురువారం తెలిపారు. గతేడాది కంటే ప్రస్తుత మార్చి, ఏప్రిల్‌ నెలలో విద్యుత్‌ వినియోగం బాగా పెరిగిందన్నారు. 20శాతం విద్యుత్‌ డిమాండ్‌ కూడా పెరిగిందన్నారు. విద్యుత్‌ వాడకం పెరుగుతుండడంతో రోజుకు 90మిలియన్ల యూనిట్లు అవసరమవుతోందన్నారు. కాగా, ఎండలు పెరుగుతుండడంతో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కాలిన 24 గంటల్లోనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు, అనంతపురం, కడపజిల్లాల్లో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉందన్నారు. 

Advertisement
Advertisement
Advertisement