హమాలీల నిరవధిక సమ్మె

ABN , First Publish Date - 2020-08-13T10:16:16+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌ సరఫరా గిరిజన సహకార సం ఘం(జీసీసీ) గోదాముల్లో పని చేస్తున్న హమాలీల సమ్మెలో భాగంగా తమ సమస్యలు

హమాలీల నిరవధిక సమ్మె

బెల్లంపల్లి టౌన్‌, ఆగస్టు 12: రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌ సరఫరా గిరిజన సహకార సం ఘం(జీసీసీ) గోదాముల్లో పని చేస్తున్న హమాలీల సమ్మెలో భాగంగా తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం బెల్లింపల్లి గోదాంలో పని చేస్తున్న  కార్మికులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేపట్టారు. హమాలీ కార్మిక సంఘాల జేఏసీ ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో బెల్లంపల్లి ప్రాంత నాయకులు పులి పాక చంద్రశేఖర్‌, కుడుదుల నారాయణ, మొగిళి, కొలిపాక సతీష్‌ మాట్లాడారు. ప్రభు త్వం హమాలీ కార్మికులకు బస్తాల ఎగుమతి, దిగుమతి రేట్లను రూ. 24కు పెంచాలని డిమాండ్‌ చేశారు. జీసీసీల్లో పని చేస్తున్న హమాలీ కార్మికులకు సివిల్‌ సరఫరా నిబంధనలు అమలు పర్చాలని కోరారు.


కార్మికులకు గుర్తింపు కార్డులు ప్రభుత్వం అందజేయాలని డిమాండ్‌ చేశారు. గత ఏడాది ప్రభుత్వం ప్రమాధ బీమా రూ. ఆరు లక్షలు చెల్లిస్తామని, ఈఎస్‌ఐ పర్తింపజేస్తామని చెప్పి నేటికి అమలు పర్చలేదని చెప్పారు. రిటైర్డ్‌ అయిన కార్మికులకు బెన్‌ఫిట్స్‌ ఇవ్వాలని, మహిళా స్వీపర్లకు నెలకు రూ. 7 వేలు వేతనం చెల్లించా లని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో దానం రవి, ఎన్‌. సత్తయ్య, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 


లక్షెట్టిపేట: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక పౌర సరఫరాల గోదాం ఎదుట హమాలి కార్మి కులు సమ్మెలో పాల్గొన్నారు. తమ హక్కులను సాధించే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలి పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయ కులు దేవవరం, రమణారెడ్డి, రవికిరణ్‌, కార్మిక సంఘం నాయకులు తిప్పని సత్తయ్య, బైరి రాజన్న, మల్లేష్‌, చింతల సత్తన్న, బాలమల్లు, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-13T10:16:16+05:30 IST