నిరాడంబరంగా స్వాతంత్య్ర దినోత్సవం..?

ABN , First Publish Date - 2020-07-05T07:51:45+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎర్రకోటపై ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించే అవకాశం ఉంది. పరిమిత సంఖ్యలో జనంతో వేడుకలు...

నిరాడంబరంగా స్వాతంత్య్ర దినోత్సవం..?

తి తక్కువ మందితో వేడుకలు జరిగే చాన్స్‌


న్యూఢిల్లీ, జూలై 4: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎర్రకోటపై ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించే అవకాశం ఉంది. పరిమిత సంఖ్యలో జనంతో వేడుకలు జరిపి దేశ ప్రజలంతా ఎలకా్ట్రనిక్‌ మాధ్యమాల్లో ఉత్సవాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. ‘‘గతంతో పోలిస్తే ఈసారి వేడుకలకు మూడో వంతు మందినే అనుమతించే అవకాశం ఉంది. కార్యక్రమంలో భౌతిక దూరాన్ని కచ్చితంగా అమలు చేస్తారు’’ అని ఎర్రకోట అధికారి ఒకరు తెలిపారు. భౌతిక దూరం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈసారి వేదికపై తక్కువ మంది ప్రముఖులు కూర్చునే అవకాశం ఉంది. వేడుకలను తిలకించేందుకు సాధారణ జనాన్ని అనుమతించాలా.. వద్దా.. అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బడి పిల్లల ప్రవేశంపై స్పష్టత లేదు. ఎర్రకోట లోపల రెండు, బయట రెండు ఐసొలేషన్‌ చాంబర్లను ఏర్పాటు చేయనున్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ అంబులెన్సులను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. వేడుకలకు ముందు ఎర్రకోట సిబ్బందికీ కరోనా పరీక్షలు చేస్తారని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-05T07:51:45+05:30 IST