ఇండిపెండెంట్‌ ఇల్లు - అపార్టుమెంట్‌ ఫ్లాట్‌ రెండింటిలో ఏది బెటర్‌?

ABN , First Publish Date - 2021-07-19T05:30:00+05:30 IST

ఈ మధ్యకాలంలో అపార్టుమెంట్‌ సంస్కృతి బాగా విస్తరించింది. అయితే ఇండిపెండెంట్‌ ఇల్లు కట్టుకోవడం మంచిదా

ఇండిపెండెంట్‌ ఇల్లు - అపార్టుమెంట్‌ ఫ్లాట్‌ రెండింటిలో ఏది బెటర్‌?

మధ్యకాలంలో అపార్టుమెంట్‌ సంస్కృతి బాగా విస్తరించింది. అయితే ఇండిపెండెంట్‌ ఇల్లు కట్టుకోవడం మంచిదా? అపార్టుమెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేయడం బెటరా? అనే సందేహం చాలామందిలో ఉంది. నిజానికి ఈ రెండింటిలో దేని ప్రయోజనాలు దానికున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే ఇండిపెండెంట్‌ ఇంటికే మొగ్గు చూపాలి. 


మనిషికి ఇల్లు ఎంత అవసరమో, ఇంటికి గాలి, వెలుతురు అంత అవసరం. ఇంటికి వాస్తు కన్నా ముందు గాలి, వెలుతురు కావాలి. 

సొంత ఇల్లు ఉంటే కొంతకాలం తరువాత మార్పులు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఫ్లాట్‌ తక్కువ ధరలో వస్తుంది కానీ నెలనెలా మెయింటెనెన్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. పక్క ఫ్లాట్‌ వాళ్లతో సమస్యలు రావచ్చు. 

అపార్టుమెంట్‌లో ఫ్లాట్‌ తీసుకుంటే ఎలాంటి కన్‌స్ట్రక్షన్‌ చేసే వీలుండదు. మీ ఫ్లాట్‌ మెయిన్‌డోర్‌కు స్టోన్‌ క్లాడింగ్‌ గానీ, వాల్‌ క్లాడింగ్‌ గానీ చేసుకునే అధికారం మీకుండదు. 

ఫ్లాట్‌లో గాలి, వెలుతురు చాలా తక్కువ ఉంటుంది. ప్లంబింగ్‌ సమస్యలు ఏర్పడినప్పుడు మీ ఫ్లాట్‌లోకి నిమ్ము వచ్చే అవకాశం ఉంటుంది. మీ కారు పార్క్‌ ఏరియాలో డ్రైన్‌ పైపు లీకేజ్‌ సమస్య ఏర్పడవచ్చు. ఆ సమస్యను అపార్టుమెంట్‌ సొసైటీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవచ్చు. 

ఇండిపెండెంట్‌ ఇల్లయితే నచ్చినట్టు కట్టుకోవచ్చు. బాల్కనీలో మొక్కలు పెట్టుకోవచ్చు. రూఫ్‌ గార్డెనింగ్‌ చేసుకోవచ్చు. 

అపార్టుమెంటులో ఒక ప్రయోజనం ఏమిటంటే సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. అయితే కరొనా సమయంలో అపార్టుమెంటుల్లో ఉండే వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. బయటకు వెళ్లే అవకాశం ఉండదు. తలుపు తీయలేరు. లోపల ఉండలేరు. ఇండిపెండెంట్‌ హౌజ్‌ అయితే స్వేచ్ఛ ఉంటుంది. మీకు నచ్చినట్టు ఉండే వీలుంటుంది. డబ్బులు సమకూరితే పైన మరో అంతస్తు వేసుకోవచ్చు.

 

కె.పి. రావు

ప్రముఖ ల్యాండ్‌స్కేప్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌

ఫోన్‌ : 8019411199

Updated Date - 2021-07-19T05:30:00+05:30 IST