ఇండియా 1 పేమెంట్స్... ఐపీఓకు పత్రాల దాఖలు

ABN , First Publish Date - 2021-09-09T00:20:02+05:30 IST

బీటీఐ పేమెంట్స్‌గా వ్యవహారంలో ఉన్న ఇండియా 1 పేమెంట్స్ లిమిటెడ్ ఐపీఓకు సిద్ధమవుతోంది.

ఇండియా 1 పేమెంట్స్... ఐపీఓకు పత్రాల దాఖలు

బెంగళూరు : బీటీఐ పేమెంట్స్‌గా వ్యవహారంలో ఉన్న ఇండియా 1 పేమెంట్స్ లిమిటెడ్ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ప్రారంభ షేర్-సేల్‌లో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయడంతో పాటు ప్రమోటర్లు, పెట్టుబడిదారుల ద్వారా 10,305,180 ఈక్విటీ షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద ఉన్నాయి. ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా బ్యాంక్‌టెక్ గ్రూప్ లక్ష ఈక్విటీ షేర్లను, బీటీఐ పేమెంట్స్ ద్వారా 25.08 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది.  కాగా... ఐపీఓ ద్వారా రానున్  ఆదాయాన్ని దేశవ్యాప్తంగా ఏటీఎంల ఏర్పాటుకు, ఇతరత్రా సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం, రుణ చెల్లింపులకు, ఇతరత్రా సంస్థ మూలధన వ్యయ అవసరాలకు వినియోగించనుంది. బ్యాంక్‌టెక్ గ్రూప్ ప్రమోట్ చేసిన ఇండియా 1 చెల్లింపులు 2006 సంవత్సరంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత 2013 లో ఐసీఐసీఐ వెంచర్స్ పెట్టుబడి పెట్టింది. 

Updated Date - 2021-09-09T00:20:02+05:30 IST