ప్రపంచ జీడీపీ వృద్ధిలో 15 శాతానికి భారత్‌ వాటా

ABN , First Publish Date - 2021-01-20T08:49:59+05:30 IST

మరో ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2025-26 నాటికి) ప్రపంచ జీడీపీ వృద్ధిలో భారత్‌ వాటా 15 శాతానికి పెరగవచ్చని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంటోంది.

ప్రపంచ జీడీపీ వృద్ధిలో 15 శాతానికి భారత్‌ వాటా

 2025-26కల్లా చేరుకోవచ్చంటున్న యూబీఎస్‌ 


ముంబై: మరో ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2025-26 నాటికి) ప్రపంచ జీడీపీ వృద్ధిలో భారత్‌ వాటా 15 శాతానికి పెరగవచ్చని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంటోంది. భారత ప్రభుత్వం  చేపడుతోన్న సంస్కరణలతో దీర్ఘకాలిక జీడీపీ వృద్ధి రేటు 7.5-8 శాతానికి చేరుకోవచ్చని, తద్వారా ప్రపంచ వృద్ధిలో భారత్‌ కీలకపాత్రపోషించనుందని పేర్కొంది. తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, కార్మిక చట్టాల్లో సవరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపడుతున్న విధానపరమైన చర్యలు, ప్రైవేటీకరణ ప్రక్రియ ద్వారా దేశంలో ఉత్పాదకత పెరగడంతోపాటు వృద్ధికీ దోహదపడనుందని యూబీఎస్‌ ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-01-20T08:49:59+05:30 IST