టాంజానియాతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం !

ABN , First Publish Date - 2020-10-30T15:16:15+05:30 IST

ఇప్పటివరకు భారత్ 18 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

టాంజానియాతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం !

న్యూఢిల్లీ: ఇప్పటివరకు భారత్ 18 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో టాంజానియా చేరింది. టాంజానియాతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్నట్లు బుధవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. "ప్రయాణికులు ఇది గమనించాలి. భారత్, టాంజానియా మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం కుదిరింది. రెండు దేశాలకు చెందిన ఎంపిక చేయబడిన క్యారియర్లు ఇరు దేశాల మధ్య విమానాలు నడపడానికి అనుమతి ఉంటుంది. కనుక మీ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి" అని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. 


ఇక ఇప్పటికే భారత్... ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, భూటాన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, మాల్దీవులు, నైజీరియా, ఒమన్, ఖతార్, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), అమెరికాతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు కరోనా లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులను స్వదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వం మే మొదటి వారం నుంచి చేపట్టిన 'వందే భారత్ మిషన్' ద్వారా ఇప్పటివరకు 28 లక్షలకు పైగా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.   

Updated Date - 2020-10-30T15:16:15+05:30 IST