అఫ్ఘాన్‌ పౌరులకు భారత్ 'ఎమర్జెన్సీ వీసాలు'

ABN , First Publish Date - 2021-08-18T19:42:21+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. ఆ దేశం నుంచి మనదేశానికి రావాలనుకునే అఫ్ఘాన్‌ పౌరులకు ఈ-వీసా జారీ చేస్తామని భారతదేశం మంగళవారం ప్రకటించింది. మతంతో సంబంధం లేకుండా.. అఫ్ఘాన్లు ఎవరైనా ఆన్‌లైన్‌ ద్వారా అత్యవసర ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

అఫ్ఘాన్‌ పౌరులకు భారత్ 'ఎమర్జెన్సీ వీసాలు'

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. ఆ దేశం నుంచి మనదేశానికి రావాలనుకునే అఫ్ఘాన్‌ పౌరులకు ఈ-వీసా జారీ చేస్తామని భారతదేశం మంగళవారం ప్రకటించింది. మతంతో సంబంధం లేకుండా.. అఫ్ఘాన్లు ఎవరైనా ఆన్‌లైన్‌ ద్వారా అత్యవసర ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో జారీ చేసే ఈ కొత్త వీసాను ‘ఈ-ఎమర్జెన్సీ ఎక్స్‌-మిసిలేనియస్‌ వీసా’గా వ్యవహరిస్తున్నట్టు తెలిపింది. భద్రతపరమైన అంశాలను పరిశీలించి.. ప్రాథమికంగా 6 నెలల కాలపరిమితితో ఈ వీసా జారీ చేయనున్నట్టు పేర్కొంది. కాగా.. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఇంకా మూసివేయలేదని ఏఎన్‌ఐ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.  

Updated Date - 2021-08-18T19:42:21+05:30 IST