అవినీతి సూచీలో భారత్‌ @77

ABN , First Publish Date - 2020-11-20T06:46:50+05:30 IST

ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవినీతి సూచీలో భారత్‌ దేదీప్యమానంగా వెలిగి పోతోంది. వ్యాపార అవినీతికి సంబంధించి 2020 సంవత్సరానికి ‘ట్రేస్‌’ అనే సంస్థ రూపొందించిన సూచీలో భారత్‌కు 77వ స్థానం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 194 దేశాలు, ప్రాంతాల్లో వ్యాపార అవినీతి తీవ్రతను పరిశీలించి...

అవినీతి సూచీలో భారత్‌ @77

న్యూఢిల్లీ: ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవినీతి సూచీలో భారత్‌ దేదీప్యమానంగా వెలిగి పోతోంది. వ్యాపార అవినీతికి సంబంధించి 2020 సంవత్సరానికి ‘ట్రేస్‌’ అనే సంస్థ రూపొందించిన సూచీలో భారత్‌కు 77వ స్థానం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 194 దేశాలు, ప్రాంతాల్లో వ్యాపార అవినీతి తీవ్రతను పరిశీలించి ఈ సంస్థ ఏటా ఒక సూచీని విడుదల చేస్తుంది. గత ఏడాది సూచీలో 48 పాయింట్లతో భారత్‌ 78వ స్థానంలో ఉంది. ఈ ఏడాది  మూడు పాయింట్లు తగ్గించుకుని 77వ స్థానంలో నిలిచింది. పొరుగునే ఉన్న భూటాన్‌ మాత్రం 37 పాయింట్లతో 48వ ర్యాంక్‌  దక్కించుకుంది. వ్యాపార అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాల జాబితాల్లో ఈ ఏడాది కూడా డెన్మార్క్‌, నార్వే, ఫిన్లాండ్‌, స్వీడన్‌, న్యూజిలాండ్‌ దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి.  

Updated Date - 2020-11-20T06:46:50+05:30 IST