భారత్ క్లీన్ స్వీప్.. కివీస్ గడ్డపై భారత్ ప్రపంచ రికార్డు!

ABN , First Publish Date - 2020-02-02T22:34:12+05:30 IST

టీ20ల్లో భారత జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. కివీస్ గడ్డపై అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో

భారత్ క్లీన్ స్వీప్.. కివీస్ గడ్డపై భారత్ ప్రపంచ రికార్డు!

మౌంట్ మాంగనూయి: టీ20ల్లో భారత జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. కివీస్ గడ్డపై అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో ఇక్కడ జరిగిన చివరి టీ20లో అద్భుత విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా ఇప్పటి వరకు ఏ జట్టూ సాధించని రికార్డును తనపేరుపై లిఖించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ 45, కెప్టెన్ రోహిత్ శర్మ 60, శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులు చేశారు. 


అనంతరం 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. వికెట్ కీపర్ టిమ్ సీఫఎర్ట్ (50), రాస్ టేలర్ (53) అర్ధ సెంచరీలతో విరుచుకుపడినప్పటికీ జట్టును పరాజయం నుంచి కాపాడలేకపోయారు. కివీస్ జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం భారత జట్టు బౌలింగ్ బలాన్ని చెప్పకనే చెబుతోంది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా, నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తీసుకున్నాడు. 

Updated Date - 2020-02-02T22:34:12+05:30 IST