కొవాగ్జిన్‌ ప్రైవేటు ధర అందుకే ఎక్కువ

ABN , First Publish Date - 2021-06-16T06:39:46+05:30 IST

దేశీయంగా అభివృద్ధి చేసినప్పటికీ కొవాగ్జిన్‌ టీకా ధర ఎక్కువగా ఉండడంపై భారత్‌ బయోటెక్‌ స్పందించింది. ఒక్కో డోసు రూ.150 చొప్పున కేంద్రానికి విక్రయించడంతో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికే ప్రైవే టు మార్కెట్‌లో విక్రయించే డోసుల ధర

కొవాగ్జిన్‌ ప్రైవేటు ధర అందుకే ఎక్కువ

కేంద్రానికి రూ.150కి దీర్ఘకాలం ఇవ్వలేం

ఆ నష్టం భర్తీకే ప్రైవేటులో అధిక ధర

ప్రభుత్వాలు, ప్రైవేటుకు ఇస్తున్న ధరల సగటు

లెక్కిస్తే వస్తున్నది డోసుకు 250 కన్నా తక్కువే

మొత్తం ఉత్పత్తిలో మార్కెట్‌కు 10 శాతమే

కొవాగ్జిన్‌ ధరలపై భారత్‌ బయోటెక్‌ ప్రకటన


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి బిజినెస్‌), జూన్‌ 15: దేశీయంగా అభివృద్ధి చేసినప్పటికీ కొవాగ్జిన్‌ టీకా ధర ఎక్కువగా ఉండడంపై భారత్‌ బయోటెక్‌ స్పందించింది. ఒక్కో డోసు రూ.150 చొప్పున కేంద్రానికి విక్రయించడంతో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికే ప్రైవే టు మార్కెట్‌లో విక్రయించే డోసుల ధర పెంచాల్సి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. సేకరణ తక్కువగా, పంపిణీ ఽఖర్చులు ఎక్కువగా ఉండడం, రిటైల్‌ మార్జి న్లు తదితర కారణాల వల్లే ఇతర కరోనా టీకాలతో పోలిస్తే కొవాగ్జిన్‌ ధరలు ప్రైవేటు మార్కెట్‌లో ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. భారత్‌ బయోటెక్‌ సంస్థ కేంద్రానికి కొవాగ్జిన్‌ టీకా ఒక్కో డోసు రూ.150 చొప్పు న, రాష్ట్ర ప్రభుత్వాలకు డోసు రూ.400 చొప్పున, ప్రైవే టు ఆస్పత్రులకు రూ.1200 చొప్పున విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఆదేశాల మేరకు ఆ సంస్థ ఉత్పత్తి చేస్తున్న టీకాల్లో 10ులోపు మాత్రమే ప్రైవేటు మార్కెట్లో విక్రయిస్తోంది. మిగతా టీకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే సరఫరా చేస్తోంది. రాష్ట్రాలకు, కేం ద్రానికి, ప్రైవేటుకు విక్రయిస్తున్న అన్ని డోసులనూ కలిపి లెక్కిస్తే తమకు డోసుకు రూ.250 కన్నా తక్కువే వస్తోందని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. ‘‘కొవాగ్జిన్‌ను హోల్‌ విరియన్‌ ఇనాక్టివేటెడ్‌ వెరోసెల్‌ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశాం. ఈ తరహా వ్యాక్సిన్ల తయారీ చాలా క్లిష్టంగా ఉంటుంది.


లైవ్‌ వైరస్‌ ఆధారిత ముడివస్తువులను తయారీలో వినియోగిస్తాం. శుద్ధి ప్రక్రియ బహుళ స్థాయుల్లో ఉండటంతో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి బ్యాచ్‌కీ 200కు పైగా నాణ్యత నియంత్రణ పరీక్షలు చేయాలి.’’ అని వివరించింది. వీటన్నిం టి వల్లే ఆ ధర పెట్టాల్సి వచ్చిందని పేర్కొంది. అర్హులైన వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా టీకాలు వేయి స్తోందని, దీంతో ఆ ధరకు ఇష్టమైనవారే ప్రైవేటు ఆస్పత్రుల్లో తమ టీకా వేయించుకుంటారని అభిప్రాయపడింది. ఇకపై కేంద్ర, రాష్ట్రాలకు 75ు టీకాలు సరఫరా చేస్తామని.. ప్రైవేటు ఆస్పత్రులకు 25ు మేర విక్రయిస్తామని వెల్లడించింది. ఈ టీకా అభివృద్ధి చేయడానికి, క్లినికల్‌ ట్రయల్స్‌కు, ఉత్పత్తి సౌకర్యాల ఏర్పాటుకు.. భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు అంచనా.


ఈ వ్యాక్సిన్‌ తయారీలో తమకు భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్‌).. సార్స్‌-కొవ్‌-2 వైర్‌సను అందజేయడం, జంతువులపై అధ్యయనాలు నిర్వహించడం, వైరస్‌ లక్షణాల నిర్ధారణ, టెస్ట్‌ కిట్లు, క్లినికల్‌ ట్రయల్స్‌కు పాక్షికంగా నిధు లు సమకూర్చడం వంటి సహాయాలు చేసిందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ప్రతిగా తాము ఐసీఎంఆర్‌కు, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి టీకా అమ్మకాలపై రాయల్టీలు చెల్లిస్తామని పేర్కొంది.

Updated Date - 2021-06-16T06:39:46+05:30 IST