మరోసారి భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు

ABN , First Publish Date - 2020-07-14T04:36:43+05:30 IST

న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు మంగళవారం ఉదయం జరగనున్నాయి. చుసూల్‌లో జరగనున్న ఈ చర్చల్లో భారత్ తరపున లెఫ్టెనెంట్ జనరల్ హర్‌దీప్ సింగ్ చర్చలు జరుపుతారు.

మరోసారి భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు

న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు మంగళవారం ఉదయం జరగనున్నాయి. చుసూల్‌లో జరగనున్న ఈ చర్చల్లో భారత్ తరపున లెఫ్టెనెంట్ జనరల్ హర్‌దీప్ సింగ్ చర్చలు జరుపుతారు. గతంలో మూడుసార్లు జరిగిన చర్చల్లోనూ భారత్‌కు ఆయనే నేతృత్వం వహించారు. మంగళవారం సమావేశంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గించేందుకు తీసుకుంటోన్న చర్యలపై చర్చిస్తారు. బలగాల ఉపసంహరణ ఏ స్థాయిదాకా వచ్చిందనే విషయంపై కూడా చర్చిస్తారు. జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఆ తర్వాత చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించుకున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని సాదారణ స్థాయికి తీసుకొచ్చాయి. 


మరోవైపు ఈ నెల 16, 17 తేదీల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేహ్‌లో హై సెక్యూరిటీ రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు. ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితిని సమీక్షిస్తారు. శ్రీనగర్‌లో కూడా రాజ్‌నాథ్ పర్యటించే అవకాశం ఉంది. కోర్ కమాండర్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు.  

Updated Date - 2020-07-14T04:36:43+05:30 IST