Abn logo
Oct 9 2021 @ 18:05PM

లద్దాఖ్ ప్రతిష్టంభన: ఇండో-చైనా 13వ రౌండ్ సైనిక చర్చలు

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో 17 నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఒక పరిష్కారం కనుగొనేందుకు మరోసారి సైనిక చర్చలు జరగనున్నాయి. భారత్-చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి 13వ రౌండ్ చర్చలు ఆదివారం జరగనున్నాయి. చైనా వైపు ఉన్న ఛుషుల్-మోల్డో సరిహద్దు సిబ్బంది సమావేశం (బీపీఎం) పాయింట్ వద్ద ఈ చర్చలు జరుగనున్నాయి. భారత్ తరఫు ప్రతినిధి బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ సారథ్యం వహిస్తారు. చైనావైపు సౌత్ జిన్‌జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మేజర్ జనరల్ లియూ లిన్ నేతృత్వం వహిస్తారు.

చైనా తమవైపు ఉన్న సరిహద్దుల్లో  పెద్దఎత్తున నిర్మాణాలు చేపడుతోందని,  మరోసారి చైనా దుస్సాహసానికి ఒడిగట్టకుండా తాము పూర్తి దృష్టి సారించామని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శనివారంనాడు పేర్కొన్న నేపథ్యంలో మరో విడత సైనిక చర్చలు జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండిImage Caption