Abn logo
Sep 10 2021 @ 10:47AM

దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 34,973 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 37,681 మంది డిశ్చార్జ్ అవగా... 260 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,31,74,954కి చేరింది. ప్రస్తుతం 3,90,646 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,23,42,299గా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,42,009గా నమోదు అయ్యింది. అలాగే దేశ వ్యాప్తంగా 72,37,84,586 మంది టీకా తీసుకున్నారు.