భారత్‌లో 1000+ కేసులు

ABN , First Publish Date - 2020-03-30T10:11:22+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ కేసులు 1,024కు పెరిగాయి. తాజాగా గుజరాత్‌, జమ్మూ కశ్మీర్‌లో రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మృతుల సంఖ్య 27కు చేరింది. కేరళలో ఆదివారం ఒక్కరోజే 20 కేసులు

భారత్‌లో 1000+ కేసులు

  • కేరళ 202, మహారాష్ట్ర 196 
  • కేరళ, గోవాలో ముగ్గురి మృతి
  • కరోనా పరీక్షలకు 47 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి
  • లాక్‌డౌన్‌ మానసిక సమస్యలకు
  • టోల్‌-ఫ్రీ నం. 08046110007


న్యూఢిల్లీ, మార్చి 29: దేశంలో కరోనా వైరస్‌ కేసులు 1,024కు పెరిగాయి. తాజాగా గుజరాత్‌, జమ్మూ కశ్మీర్‌లో రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మృతుల సంఖ్య 27కు చేరింది. కేరళలో ఆదివారం ఒక్కరోజే  20 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసులు 181కు పెరిగాయి. మహారాష్ట్రలో కొత్తగా మూడింటితో మొత్తం కేసులు 196కు చేరాయి. కర్ణాటకలోనూ కరోనా విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 83కు పెరిగింది. కేరళలో హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న ఇద్దరు మృతిచెందారు. వీరిద్దరూ అబ్జర్వేషన్‌లో ఉన్నవారే. ఒకరి వయసు 65 ఏళ్లు. ఈ నెల 21న ఆయన విదేశాల నుంచి తిరిగొచ్చారు. కరోనా లక్షణాలు కనిపించకపోయినా నిబంధనల ప్రకారం ఆయనను ఇంటి వద్ద క్వారంటైన్‌లో ఉంచారు. ఆదివారం గుండెపోటు వచ్చి మృతిచెందాడు. మరో వ్యక్తి వయసు 41 ఏళ్లు. కొట్టాయం జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌. ఈ నెల 18న ముంబై నుంచి వచ్చాక హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఇంట్లో ఉండగా స్పృహ కోల్పో యి మృతిచెందాడు. గోవా వైద్య కళాశాల ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉన్న 68 ఏళ్ల మహిళ మరణించింది. ఆమె నమూనాల పరీక్షా ఫలితాలు రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు.


34,931 నమూనాల పరీక్ష

ప్రస్తుతం కొనసాగుతున్న 21 రోజుల లాక్‌డౌన్‌ వల్ల కొందరిలో ప్రవర్తనా సంబంధ, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని  కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. వారి కోసం ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎ్‌స టోల్‌-ఫ్రీ నంబరు 08046110007 ఏర్పాటు చేసిందని తెలిపా రు. ఈ నంబరు ద్వారా వైద్యులను సంప్రదించవచ్చని చెప్పా రు. ఆదివారం వరకు 34,931 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త ఆర్‌.గంగా ఖేట్కర్‌ పేర్కొన్నారు. కరోనా పరీక్షలకు 113 ప్రభుత్వ, 47 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చామన్నారు. కాగా, ఇరాన్‌ నుంచి వచ్చిన 275 మందిని ఢిల్లీ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ తరలించారు.


అంత్యక్రియలను అడ్డుకొన్న స్థానికులు 

అహ్మదాబాద్‌లో కరోనాతో మృతిచెందిన 46 ఏళ్ల మహిళ అంత్యక్రియలను స్థానికులు అడ్డుకొన్నారు. తమకు కూడా కరోనా సోకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


స్పైస్‌జెట్‌ పైలట్‌కు కరోనా 

స్పైస్‌జెట్‌ పైలట్‌ ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అ యింది. ‘‘అతను అంతర్జాతీయ విమానాన్ని నడపలేదు. చివరిగా ఈ నెల 21 చెన్నై-ఢిల్లీ విమానాన్ని నడిపాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే స్వీయ క్వారంటైన్‌లో ఉన్నాడు. శనివారం అతని రిపోర్టు వచ్చింది’’ అని స్పైస్‌జెట్‌ ప్రతినిధి తెలిపారు.

Updated Date - 2020-03-30T10:11:22+05:30 IST